Surya grahanam: సూర్య గ్రహణానికి ముందు సూర్య సంచారం, ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిందే

Published : Sep 17, 2025, 05:03 PM ISTUpdated : Sep 17, 2025, 05:13 PM IST

సూర్యగ్రహణానికి (solar eclipse) ముందు సూర్యుడి (Sun) సంచారం జరగబోతోంది. దీని వల్ల  నాలుగు రాశుల (Zodiac Sign) వారికి ఇబ్బందులు రావచ్చు. సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదే కన్యారాశిలో సెప్టెంబరు 21న సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 

PREV
14
వృషభ రాశి

సూర్యుడి సంచారం వల్ల సూర్యగ్రహణం తరువాత వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  వీరు ఇంట్లోని పెద్దలతో సర్దుకుపోలేరు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ధన నష్టం కూడా ఏర్పడే అవకాశం ఉంది. 

24
మకర రాశి

సూర్యుడి సంచారం అనేది మకర రాశి వారికి ఒత్తిడి, అశాంతిని కలిగిస్తుంది. కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. ఆదాయం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి.

34
కర్కాటక రాశి

సూర్య గ్రహణం, సూర్యుని కన్యా రాశి సంచారం అనేది కర్కాటక రాశి వారికి మంచిది కాదు. వారు చేస్తున్న పనులు మధ్యలో ఆగిపోవచ్చు.  స్నేహితులు, బంధువుల సంబంధాలలో విభేదాలు రావచ్చు. అసూయకు దూరంగా ఉండండి.  ఆలోచనలు సానకూలంగా ఉండేలా చూసుకోండి.

44
కన్యా రాశి

సూర్యుడు ప్రస్తుతం కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు.  సెప్టెంబరు 21న అదే రాశిలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి, కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కెరీర్‌లో సవాళ్లు ఎదురవుతాయి. ఖర్చులు పెరగవచ్చు. సంబంధాలు దెబ్బతినొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories