2026లో గ్రహాల మార్పులు చాలా చోటుచేసుకున్నాయి. జనవరి 24వ తేదీ శనివారం గ్రహాలకు రాజు అయిన సూర్యుడు మకర రాశి నుంచి శ్రవణా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఆత్మ , గౌరవం, కీర్తి, తండ్రితో సంబంధం, ఉత్సాహం, బలం, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యానికి ప్రతీక అయిన సూర్యుని ఈ సంచారం కొన్ని రాశుల వారికి అపారమైన ప్రయోజనాలు చేకూరుస్తుందని జోతిష్యశాస్త్రం చెబుతుంది.ముఖ్యంగా, ఐదు రాశుల వారి జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. ఆరోగ్యం, ఇంట్లో కలహాలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగలేమి, వ్యాపారంలో లాభం లేకపోవడం, గౌరవ మర్యాదలు లేకపోవడం వంటి సమస్యల నుండి విముక్తి పొందుతారు. మరి, ఈ శుభ ఫలితాలు పొందే ఆ రాశులేంటో చూద్దాం...