Sun Transit: శని నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 4 రాశులకు అదృష్టం తలుపు తట్టడం ఖాయం!

Published : Jul 06, 2026, 03:45 PM IST

Sun Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జూలై 20న సూర్యుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశులవారికి ఆర్థికంగా లాభాలు, కెరీర్‌లో మంచి పురోగతి, అదృష్ట యోగం పట్టే అవకాశాలున్నాయి. మరి ఆ రాశులేవో, అందులో మీ రాశి ఉందో చూడండి.

PREV
15
సూర్యుడి నక్షత్ర సంచారం

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రారాజు అయిన సూర్యుడి సంచారాన్ని చాలా ముఖ్యమైందిగా భావిస్తారు. జూలై 20న సూర్యుడు, శని అధిపతిగా ఉండే పుష్య నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. పుష్య నక్షత్రాన్ని నక్షత్రాల రాజుగా పిలుస్తారు. సూర్యుడు, శని మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ, పుష్య నక్షత్రం చాలా శుభప్రదమైంది. ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సూర్యుడు ఈ శుభ నక్షత్రంలోకి రాగానే, కొన్ని రాశులవారికి అభివృద్ధి, ఆర్థిక లాభాలకు కొత్త దారులు తెరుచుకుంటాయి.

25
మేష రాశి- వ్యాపారాల్లో మంచి లాభాలు

మేష రాశివారికి సూర్యుడి నక్షత్ర మార్పు వల్ల సౌకర్యాలు, శ్రేయస్సు పెరుగుతాయి. ఉద్యోగులకు పనిలో కీలకమైన బాధ్యతలు లేదా కొత్త ప్రాజెక్టులు దక్కవచ్చు. వ్యాపారులకు ఇది మంచి లాభాలు పొందే సమయం. భూమి, భవనం లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. తల్లిదండ్రుల నుంచి మద్ధతు, ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది.

35
మిథున రాశి- ఆకస్మిక ధనలాభం

మిథున రాశివారికి, పుష్య నక్షత్రంలోకి సూర్యుడి సంచారం బలమైన ఆర్థిక ఫలితాలను ఇస్తుంది. మీ మాటతీరుతో ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం లేదా పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనం కలగవచ్చు. ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తాయి.

45
సింహ రాశి- పేరు ప్రతిష్ఠలు

సింహ రాశికి అధిపతి సూర్యుడే కాబట్టి, ఈ నక్షత్ర మార్పు మీ ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని బాగా పెంచుతుంది. సమాజంలో, పనిలో మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రభుత్వ రంగాల నుంచి లేదా ఉన్నతాధికారుల నుంచి మీరు ప్రత్యక్ష ప్రయోజనాలు పొందవచ్చు. కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు.

55
వృశ్చిక రాశి- సంతృప్తికరమైన వాతావరణం

సూర్యుడి సంచారం వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. సూర్యుడు మీ ఆగిపోయిన పనులను వేగవంతం చేస్తాడు. విద్యార్థులు తమ చదువులో మంచి విజయాన్ని సాధిస్తారు. వ్యాపార లేదా ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఇది సరైన సమయం. ఇంటా బయటా అనుకూలమైన, సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories