Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నదమ్ములతో ఆస్తి వివాదాలు తప్పవు.. జాగ్రత్త!

Published : Jul 06, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 06.07.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఇతరులకు సహాయం చేస్తారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

313
వృషభ రాశి ఫలాలు

పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. ముఖ్యమైన పనులలో అవాంతరాలు తప్పవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలలో సమస్యలు ఉంటాయి.

413
మిథున రాశి ఫలాలు

దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు కలిసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

513
కర్కాటక రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు అనుకూలం.

613
సింహ రాశి ఫలాలు

సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

713
కన్య రాశి ఫలాలు

ముఖ్యమైన పనులలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. వృథా ఖర్చులు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి.

813
తుల రాశి ఫలాలు

ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. సోదరులతో స్వల్ప విభేదాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవు.

913
వృశ్చిక రాశి ఫలాలు

ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల రాక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనిచేస్తారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ఇంట్లో పరిస్థితులు మానసికంగా చికాకు పరుస్తాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. బంధువులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. వ్యాపార, ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం ఉండదు.

1113
మకర రాశి ఫలాలు

ఆప్తుల సలహాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

1213
కుంభ రాశి ఫలాలు

ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు గందరగోళంగా సాగుతాయి.

1313
మీన రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories