వృషభ రాశి వారికి సూర్య, శని పంచమహా యోగం శుభప్రదం. ఈ రాశి వారి వివాహ స్థానంలో సూర్యుడు, పదకొండవ స్థానంలో శని ఉంటాడు. ఈ కారణంగా ఈ రాశివారు అన్ని రంగాల్లోనూ విజయాలు సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలతో ఉన్న విభేదాలు తొలగుతాయి. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. దూర ప్రయాణాల ద్వారా ధన లాభం ఉంటుంది.