జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, శని తండ్రీ కొడుకులు. అయినా సరే ఈ రెండింటిని శత్రు గ్రహాలుగా చెప్తారు. రేపు (మార్చి 25న) సూర్య-శని గ్రహాల సంయోగం జరగనుంది. వీటి కలయిక కొన్ని రాశులవారికి అశుభ ఫలితాలను ఇవ్వనుంది. ఆ రాశులేవో ఇక్కడ తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రేపు (మార్చి 25, బుధవారం) సూర్యుడు, శని గ్రహాల కలయిక జరగనుంది. ఈ కలయిక కొన్ని రాశుల వారికి నష్టాలను కలిగిస్తుంది. వ్యక్తిగత జీవితం నుంచి వ్యాపారాల వరకు అశుభ ఫలితాలు రావచ్చు. మరి ఆ రాశులు ఏవో, వారికి ఏయే విషయాల్లో నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
26
మేష రాశి- ఆర్థిక నష్టాలు
సూర్య, శని గ్రహాల సంయోగం వల్ల మేష రాశివారు ఒత్తిడికి లోనవుతారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆఫీసులో పై అధికారులతో విభేదాలు రావచ్చు. తండ్రి ఆరోగ్యం గురించి వైద్యులను సంప్రదించాల్సి రావచ్చు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక విషయాలు అంతగా కలిసిరావు.
36
కర్కాటక రాశి- సంబంధాలు దెబ్బతినే ప్రమాదం
రెండు శత్రు గ్రహాల కలయిక వల్ల కర్కాటక రాశి వారు వ్యక్తిగత జీవితంలో ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటారు. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారికి నష్టాలు రావచ్చు. మీ మాట తీరు కఠినంగా మారి, సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం అంతగా ఉండదు. స్థిరాస్తి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
కన్య రాశి వారికి శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చట్టపరమైన విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి, వ్యాపారాల్లో నష్ట సూచనలు ఉన్నాయి. ఉద్యోగాల్లో తోటివారితో సమస్యలు రావచ్చు. బంధుమిత్రులతో వివాదాలు కలిగే అవకాశం ఉంది. ఇంటి వాతావరణం గంధరగోళంగా ఉంటుంది.
56
వృశ్చిక రాశి- ఆస్తి గొడవలు
వృశ్చిక రాశి వారు తమ కెరీర్‌లో సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు బలంగా ఉన్నాయి. కష్టపడి పనిచేసినా, కొన్నిసార్లు ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చు. కుటుంబంలో ఆస్తికి సంబంధించిన గొడవలు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగులు పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు మందగిస్తాయి.
66
కుంభ రాశి- ప్రయాణాల్లో జాగ్రత్త
కుంభ రాశికి అధిపతి శని. సూర్యుడితో శని కలవడం వల్ల ఈ రాశివారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఆరోగ్యం అంతగా సహకరించకపోవచ్చు. అనుకున్న పనులు అనుకున్న టైంకి పూర్తికావు. దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేరు.