రాబోయే నెలల్లో బంగారం ధర గురించి కూడా ప్రశాంత్ కిణి తన అంచనా చెప్పారు. ఆయన ప్రకారం, పసిడి ధర చాలా వరకు స్థిరంగా ఉంటుంది. 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర 11,000 నుంచి 12,000 రూపాయల మధ్య స్థిరపడుతుందని, పెద్దగా మార్పులు ఉండవని ఆయన అంచనా వేశారు.
అమెరికా విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. 'అమెరికన్లు తలుచుకుంటే బంగారం ధరను పాతాళానికి తొక్కేయగలరు' అని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, ఆకాశాన్నంటిన బంగారం ధర ఒక్కసారిగా కుప్పకూలడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు.. ప్రస్తుతం 18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,640 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.12,670గా ఉంది. ఇక గ్రాము వెండి ధర రూ.235గా నమోదైంది.