Sun Rahu Conjunction: రవి, రాహువుల కలయిక.. నెల రోజులపాటు ఈ 4 రాశులవారికి నిందలు, అవమానాలు తప్పవు!

Published : Feb 11, 2026, 01:42 PM IST

జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు, రాహువును శత్రువులుగా భావిస్తారు. ఈ 2 గ్రహాలు కలిసినప్పుడు అశుభ యోగం ఏర్పడుతుంది. త్వరలో రవి, రాహువుల కలయిక జరగనుంది. దానివల్ల 4 రాశుల వారికి కష్టాలు, నిందలు తప్పవని పండితులు చెబుతున్నారు. ఆ రాశులేంటో చూద్దామా.. 

PREV
15
కుంభ రాశిలో సూర్యుడు, రాహువుల కలయిక

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 13న సూర్యుడు మకరరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రాశిలో అప్పటికే శుక్రుడు, బుధుడు, రాహువు ఉంటారు. శుక్రుడు, బుధుడు సూర్యుడికి మిత్రులు కాగా, రాహువు శత్రు గ్రహం. సూర్యుడు, రాహువు ఒకే రాశిలో ఉండటాన్ని అశుభ సంయోగంగా భావిస్తారు. దీన్నే గ్రహణ యోగం అని కూడా అంటారు. ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14, 2026 వరకు సూర్యుడు, రాహువు కుంభరాశిలో ఉంటారు. ఈ నెల రోజుల పాటు 4 రాశుల వారికి కష్టాలు తప్పవని పండితులు చెబుతున్నారు. ఆ రాశులు ఏవో ఇక్కడ చూద్దాం.

25
వృషభ రాశి

పండితుల ప్రకారం.. సూర్య, రాహువుల కలయిక వల్ల ఏర్పడే గ్రహణ యోగం వృషభ రాశి వారికి కొత్త సమస్యలు తెస్తుంది. వరుసగా చెడు వార్తలు వినే అవకాశం ఉంది. దీనివల్ల టెన్షన్, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. పెట్టుబడుల్లో డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. అనవసర వివాదాల్లో చిక్కుకోవచ్చు. అనుకున్న పనులు ఆగిపోవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

35
సింహ రాశి

సింహ రాశికి అధిపతి సూర్యుడు. రాహువుతో సూర్యుడు కలవడం వల్ల ఏర్పడే గ్రహణ యోగం సింహ రాశి వారికి ఇబ్బందులు తెచ్చి పెడుతుంది. బంధువులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. కొత్త పనులు మొదలుపెట్టడంలో సమస్యలు వస్తాయి. ఆస్తి సంబంధిత ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం విషయంలో అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఈ నెల రోజులపాటు ఈ రాశివారు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.

45
తుల రాశి

జ్యోతిష్య పండితుల ప్రకారం తుల రాశి వారు రాబోయే కొన్ని వారాల పాటు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ యోగం కారణంగా సజావుగా సాగుతున్న పనులు కూడా చెడిపోవచ్చు, ఆగిపోవచ్చు. శత్రువులు మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసే అవకాశం ఉంది. అనవసర వివాదాల్లో మీ పేరు రావచ్చు. మీ రహస్యాలు బయటపడి అవమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇతరుల విషయాల్లో తలదూర్చడం అస్సలు మంచిది కాదు. 

55
కుంభ రాశి

కుంభ రాశిలోనే రాహు, సూర్యుల కలయిక జరగనుంది. ఈ రాశికి అధిపతి అయిన శని.. ఈ రెండు గ్రహాలకూ శత్రువే. కాబట్టి, ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లాభం వచ్చే అవకాశాలు చేజారిపోవచ్చు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కోర్టు కేసులను ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండటం మంచిది. 

Read more Photos on
click me!

Recommended Stories