Planet Alignment: ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు, ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

Published : Feb 11, 2026, 12:22 PM IST

Planet Alignment: ఫిబ్రవరి 28న ఒకే సరళరేఖపైకి 6 గ్రహాలు రాబోతున్నాయి.  ఈ అరుదైన ఖగోళ సంఘటన వల్ల 3 రాశుల వారికి బాగా కలిసొస్తుంది. ఆ రాశులేవో తెలుసుకోండి. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి.

PREV
14
ఆరు గ్రహాలు ఒకే వరుసలో

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 ఫిబ్రవరి నెల ఎంతో ప్రత్యేకంగా మారుతుంది. ఈ నెలలో ఆకాశంలో అరుదైన గ్రహాల కలయిక జరగనుంది. 2026 ఫిబ్రవరి 28న శనివారం… ఆ రోజు సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ లేదా నైరుతి దిశలో కొన్ని గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయి. బుధుడు, శుక్రుడు, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు సరళ రేఖలోకి రానున్నాయి. ఈ అరుదైన గ్రహాల కలయిక మార్చి వరకు కొనసాగినా, ఫిబ్రవరి 28న దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్ని రాశుల వారి జీవితాల్లో మంచి మార్పులు వస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

24
మేష రాశి

ఈ గ్రహాలు ఒకే రేఖలోకి రావడం వల్ మేష రాశి వారికి లాభాలు కలుగుతాయి. ఈ రాశి వారికి కొత్త ఉద్యోగం లేదా వ్యాపారంలో వచ్చే అవకాశం ఉంది.  అధికంగా డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. వీరి కెరీర్‌  దూసుకుపోతుంది. వీరికి మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఈ గ్రహాల కలయిక వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆగిపోయిన పనులు వేగవంతంగా సాగుతాయి. కొత్త పనులు చేయడానికి కావాల్సిన శక్తి సామర్ధ్యాలు పొందుతారు. 

34
కన్యా రాశి

కన్యా రాశి వారికి ఆరు గ్రహాల కలయిక అదృష్టం తెచ్చిపెడుతుంది. వీరు కోరికలు తీరుతాయి.  వీరు అనుకున్న పనులు చేయగలుగుతారు. కష్టానికి తగిన ఫలితాలు కనిపిస్తాయి. కన్యా రాశి వారికి కళా రంగంలో మంచి అవకాశాలు వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి. వీరు ఆర్థికంగా కూడా బలపడతారు.  డబ్బు సంపాదించే అవకాశాలు మెరుగవుతాయి.

44
మీన రాశి

ఆరు మీన రాశి వారికి బలమైన ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కుటుంబం, పని మధ్య సమతుల్యతను పాటిస్తారు. వివాహ యోగం ఉంది. ఇంట్లో అందరితోనూ సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఆదాయం కోసం వీరికి కొత్త దారులు తెరుచుకుంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories