Sun Moon Transit: ఎదురెదురుగా రాబోతున్న సూర్యచంద్రులు.. వ్యతిపత్ యోగంతో ఈ 4 రాశులకు అదృష్టం

Published : Mar 06, 2026, 09:25 AM IST

Sun Moon Transit: సూర్యుడు, చంద్రులు ఒక నిర్దిష్ట స్థానంలోకి వచ్చినప్పుడు వ్యతిపత్ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం మార్చి 31వ తేదీ ఉదయం 7:26 గంటలకు ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకోండి. 

PREV
14
కర్కాటక రాశి

సూర్యచంద్రుల సంయోగం వల్ల ఏర్పడే వ్యతిపత్ యోగం కర్కాటక రాశి వారికి ఎన్నో లాభాలను తెచ్చిపడుతుంది. ఈ రాశుల వారు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే మంచి సమయంగా భావించవచ్చు. అలాగే వీరు ఆలోచనలు పాజిటివ్ గా ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇప్పటివరకు ఇబ్బంది పెట్టిన ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు కొత్తదారులు ఏర్పడతాయి.సమాజంలో గౌరవం పెరుగుతుంది.మంచి పేరు తెచ్చుకుంటారు.

24
సింహ రాశి

సూర్యచంద్రుల వల్ల ఏర్పడే వ్యతిపత్ యోగం సింహ రాశి వారికి మంచి పురోగతిని అందిస్తుంది. ముఖ్యంగా మనశ్శాంతిని ఇస్తుంది. అయితే పనిచేసే చోట బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో గొడవలు వంటివి తగ్గుతాయి. ఆర్థికపరంగా కూడా పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులు నుంచి మంచి లాభాలను పొందుతారు. కుటుంబ వాతావరణం తేలికగా ఉంటుంది. అయితే కుటుంబం మీ కుటుంబ సభ్యులలో స్వార్ధాలు పెరిగే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

34
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఇన్నాళ్లు పడుతున్న గొడవలు అన్నీ తొలగిపోతాయి. పనిచేసే చోట గౌరవం పెరుగుతుంది. భావోద్వేగ పరంగా సానుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులపై పనిచేయడం మొదలుపెట్టడానికి ఇదే మంచి సమయంగా భావించవచ్చు. ఆర్థిక లాభాలు పొందే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు పెరిగి ఖర్చులు తగ్గుతాయి. ఆరోగ్య సమస్యలు కుదుటపడతాయి. వ్యాపార పరంగా చేసే ప్రయాణం వీరికి బాగా లాభాలు తెచ్చిపెడుతుంది.

44
కుంభ రాశి

కుంభ రాశి వారికి సూర్య చంద్రులు అన్ని రకాలుగా కలిసి వస్తారు. వీరికి ఆర్థిక లాభాలకు కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. మానసికంగా మంచి స్థితిలో ఉంటారు. అనవసరమైన బాధల నుండి బయట పెడతారు. చేసే పనిపై ఏకాగ్రతను పెంచుకోవచ్చు. ఆర్థిక విషయాలలో కూడా కలిసి వస్తాయి. అకస్మాత్తుగా సంపద కలిగే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా అప్పుగా ఇస్తే ఆ అప్పు తిరిగి మీ చేతికి అందుతుంది. ఆరోగ్యం కూడా మంచిగా మారుతుంది. ప్రశాంతంగా నిద్రపట్టే కాలం ఇది.

Read more Photos on
click me!

Recommended Stories