4.బేసి సంఖ్యలో డబ్బులు దొరికితే....
మీకు దొరికిన డబ్బులు బేసి సంఖ్యలో ఉంటే..అది మీ జీవితంలో కొత్త ప్రారంభానికి శ్రీకారం కాబోతోందని అర్థం. మీరు, మీ కొత్త ఆలోచనలకు ప్రాణం పోయడానికి ముందుకు సాగుతారని దీని అర్థం. అంతేకాదు.. ఏదో ఒక రంగంలో విజయం సాధిస్తారు.
5.పది రూపాయల నోటు దొరికితే అర్థం ఏంటి?
మీకు ఎప్పుడైనా పది రూపాయల నోటు దొరికితే మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్యలు రావచ్చు. కాబట్టి.. ఆ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి. మీ మనసు చెప్పిన పని చేయాలి.
6.ఉదయం పూట డబ్బులు దొరికితే....
ఇది అదృష్టానికి సంకేతం. ఇది మీ జీవితంలో పురోగతికి సూచన. ఉదయం పూట దొరికిన డబ్బును చాలా భద్రంగా దాచుకోవాలి.
8. ఆర్థిక లాభానికి సంకేతం
మీరు పని నుండి లేదా కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీకు డబ్బు దొరికితే, అది ఆర్థిక లాభానికి సంకేతం. దీని అర్థం ఏమిటంటే, మీ కఠోర శ్రమ త్వరలోనే ఫలిస్తుంది. మీకు త్వరలోనే ఆర్థిక ప్రయోజనం చేకూరవచ్చు.
ఏదైనా ముఖ్యమైన పని, ఇంటర్వ్యూ లేదా సమావేశం కోసం ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడు, రోడ్డుపై డబ్బు పడి ఉండటం మీకు కనిపిస్తే, మీ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని దానికి అర్థం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అలా దొరికిన డబ్బును తీసుకున్న తర్వాత, అందులో కొంత భాగాన్ని ఏదైనా నిరుపేద వ్యక్తికి దానం చేయాలి. మీరు కొంత డబ్బును గుడిలోని హుండీలో కూడా వేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఆ డబ్బుకు సంబంధించిన ప్రతికూల శక్తి తొలగిపోతుంది.