Shani Transit: ఆగస్టు18 తర్వాత శని మహా అద్భుతం.. ఈ రాశులవారు ఏనుగు కుంభ స్థలం కొట్టినట్లే

Published : Aug 07, 2025, 06:10 PM IST

ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని అడుగుపెడుతోంది. ఆగస్టు 18వ తేదీన ఈ సంఘటన జరగనుంది. దీని ప్రభావం.. ఐదు రాశులపై చాలా ఎక్కువగా చూపించనుంది.

PREV
16
Shani Transit

శని గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటుంది. ఈ ఏడాది మార్చిలో మీన రాశిలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నక్షత్రాల మార్పు జరుగుతూనే ఉంది. ఈ సారి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని అడుగుపెడుతోంది. ఆగస్టు 18వ తేదీన ఈ సంఘటన జరగనుంది. దీని ప్రభావం.. ఐదు రాశులపై చాలా ఎక్కువగా చూపించనుంది. అది కూడా ఆ రాశులవారికి అంతా శుభయోగమే కలిగించనుంది. ఆ రాశుల వారు ఏకంగా ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టనున్నారు. అంతటి అదృష్టం వరించనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దామా..

26
1.వృషభ రాశి..

శని నక్షత్ర మార్పు.. వృషభ రాశివారికి చాలా మేలు చేయనుంది.వారి కెరీర్ లో పురోగతి రానుంది. ఆర్థికంగా ఊహించని లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినా.. అవి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా రావాల్సిన డబ్బులు ఈ సమయంలో చేతికి అందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి. మీరు ఏ పని చేసినా కుటుంబం అండగా నిలుస్తుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. అనుకున్న పనులన్నీ సాఫీగా జరుగుతాయి.

36
2.మిథున రాశి..

మిథున రాశివారికి శని నక్షత్ర మార్పు.. చాలా ప్రయోజనాలు కలిగించనుంది. ఈ సమయంలో ఈ రాశికి చెందిన విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల సహాయంతో మంచి ఫలితాలు సాధించగలరు. కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. వ్యాపారం కూడా బాగా కలిసొస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది.

46
3.సింహ రాశి..

శని నక్షత్ర మార్పు.. సింహ రాశి వారి తలరాతను మార్చేయనుంది. వీరి తెలివి తేటలతో అనుకున్నది సాధిస్తారు. మంచి గుర్తింపు పొందుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా.. అవి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఆర్థికంగా ఏవైనా సమస్యలు ఉంటే.. అవి తీరిపోతాయి. ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది.

56
4. కన్యా రాశి: లక్ష్య సాధన కాలం

కన్య రాశివారు శని అనుగ్రహంతో తమ లక్ష్యాలను చేరుకుంటారు. అధికారులతో సంబంధాలు మెరుగవుతాయి. ఇల్లు కొనాలనుకున్న కల నెరవేరవచ్చు. మానసిక ఒత్తిడులు తగ్గుతాయి. దాంపత్య బంధం బలపడుతుంది.

66
5. తులా రాశి: సంపద, శాంతి, సంతోషం

తులా రాశివారికి శని నక్షత్ర మార్పు సానుకూల శక్తిని అందిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపారంలో లాభాలు, ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. పిల్లల అభివృద్ధి పట్ల సంతోషంగా ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories