Shani Gochar:2026 లో వెండి పాదాలపై శని.... ఈ రాశులు పట్టిందల్లా బంగారమే..!

Published : Nov 26, 2025, 12:29 PM IST

 Shani Gochar: ప్రస్తుతం శని మీన రాశిలోనే ఉన్నాడు. 2026 లో కూడా మీన రాశిలోనే సంచరిస్తాడు. అయితే, శనితో పాటు గురు గ్రహం ఇదే రాశిలో సంచరిస్తాడు. దీని కారణంగా కొన్ని రాశులకు ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. 

PREV
14
Shani Gochar

జోతిష్యశాస్త్రం ప్రకారం శని గ్రహాన్ని కర్మదాత, న్యాయమూర్తి అని అంటారు. 2026 సంవత్సరం మొత్తం శని మీన రాశిలోనే సంచరిస్తాడు. మీన రాశిలో సంచరించే శని, ఆ రాశి వ్యక్తుల జాతకంలో 2,5,9 వ ఇంట్లో సంచరిస్తాడు. ఆ రాశిలో శని వెండి పాదాలతో సంచరిస్తాడని నమ్ముతారు. దీని కారణంగా మూడు రాశులకు చాలా ప్రయోజనాలు చేకూరనున్నాయి. శని కారణంగా సంపద, శ్రేయస్సును పొందుతారు. వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...

24
కర్కాటక రాశి...

శని వెండి పాదాలపై సంచరించడం వల్ల కర్కాటక రాశివారు చాలా ప్రయోజనాలు పొందుతారు. ఈ సంవత్సరం కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు తమ కెరీర్ లో పురోగతికి అద్భుతమైన అవకాశాలను పొందుతారు. ఉద్యోగం చేసే కర్కాటక రాశివారికి ఈ ఏడాది శని ప్రభావం కారణంగా జీవితంలో పెరుగుదల, పదోన్నతి లభించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఈ రాశివారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. అసంపూర్ణ పనులన్నీ పూర్తి అవుతాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా మారుతుంది. వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు.

34
వృశ్చిక రాశి...

వృశ్చిక రాశివారికి 2026 చాలా అనుకూలంగా ఉంటుంది. శని గ్రహం వీరికి చాలా మేలు చేయనున్నాడు. శని వెండి పాదాలపై నడవడం వల్ల ఈ రాశివారికి ఈ ఏడాది అంతా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది. వీరి పనిని అందరూ ప్రశంసిస్తారు. వ్యాపారంలోనూ మంచి లాభాలు అందుకుంటారు. నెరవేరని కోరికలన్నీ ఈ ఏడాది నెరవేరతాయి. స్నేహితులు, సహోద్యోగుల నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది. కుటుంబ సమస్యలన్నీ పూర్తి అయిపోతాయి.

44
కుంభ రాశి...

2026 లో శని వెండి పాదాలపై నడవడం కుంభ రాశివారికి బంపర్ ఆఫర్ తగిలినట్లే. ఈ శని సంచారం కారణంగా, కుంభ రాశివారికి చాలా డబ్బు, సంపద లభిస్తుంది. పని, వ్యాపారం చేసే కుంభ రాశివారికి శని అనుగ్రహం కారణంగా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రాశివారి మాటల ప్రభావం పెరుగుతుంది. దీని కారణంగా, భవిష్యత్తులో అపారమైన లాభాలను పొందే అవకాశం కూడా ఉంది. ఈ కాలంలో, కుంభ రాశివారు కోల్పోయిన డబ్బును తిరిగి పొందగలరు.

Read more Photos on
click me!

Recommended Stories