Shani Dev: ఈ 3 రాశుల‌పై 2026లో ఏలిన నాటి శ‌ని ప్ర‌భావం.. అల‌ర్ట్‌గా ఉండాల్సిన స‌మ‌యం

Published : Jan 02, 2026, 02:13 PM IST

Shani Dev: శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. జాతకంలో శని అనుకూలంగా ఉంటే జీవితంలో స్థిరత్వం, క్రమశిక్షణ, ఎదుగుదల కనిపిస్తాయి. మ‌రి 2026లో ఏలిన నాటి శ‌ని ప్ర‌భావం ఏ రాశుల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపనుందంటే. 

PREV
15
ఏలినాటి శని అంటే ఏంటి?

ఒక వ్యక్తి జన్మ రాశికి ముందు, జన్మ రాశిలో, తరువాత రాశిలో శని సంచరిస్తే దానిని ఏలినాటి శని అంటారు. ఇది మొత్తం మూడు దశలుగా కొనసాగుతుంది. ఈ సమయంలో వ్యక్తి జీవితం అనేక పరీక్షలకు లోనవుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం మీద ప్రభావం పడుతుంది.

25
2026లో ఏలినాటి శని ప్రభావం ఎలా ఉంటుంది?

2026లో శని ప్రభావం కొంత తీవ్రంగా ఉండనుంది. అర్థనాటి శని ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది. దీనికి తోడు రాహు, కేతు సంచారం కూడా కొన్ని రాశులపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ ఏడాది మూడు రాశుల వారు ఏలినాటి శని ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభవించనున్నారు. కొన్ని రాశుల వారికి ఇది ప్రారంభ దశలో ఉండగా, ఒక రాశికి చివరి దశలో కొనసాగుతుంది.

35
మేష రాశి – ఏలినాటి శని తొలి దశ

మేష రాశి వారికి 2026లో ఏలినాటి శని మొదటి దశ కొనసాగుతుంది. ఈ కాలం కాస్త కఠినంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో మాటల తగాదాలు ఏర్పడవచ్చు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఓర్పుతో వ్యవహరించడం చాలా అవసరం.

45
మీన రాశి వారికి ఒత్తిడి

మీన రాశి వారికి కూడా ఏలినాటి శని మొదటి దశ కొనసాగుతుంది. ఈ ఏడాది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం రాకపోవచ్చు. ఖర్చులు నియంత్రణలో పెట్టకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

55
కుంభ రాశి వారికి మంచి రోజులు

కుంభ రాశి వారికి మాత్రం ఏలినాటి శని చివరి దశ కొనసాగుతుంది. గత కొంతకాలంగా ఎదురైన సమస్యలు నెమ్మదిగా తగ్గుతాయి. కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మానసికంగా తేలికపడే కాలం ఇది. అయితే చివరి దశ కావడంతో సంయమనం పాటిస్తే మంచి ఫలితాలు అందుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories