Shani Venus Conjunction: శని శుక్రుల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి మంచి రోజులు రాబోతున్నాయి. జనవరి 2026లో శుక్ర, శని గ్రహాలు కలిసి లాభ దృష్టి యోగాన్ని ఏర్పరుస్తాయి. ఇది మూడు రాశుల వారికి భారీగా కలిసి వస్తాయి.
శుక్రుడిని సంతోషం, శ్రేయస్సు, సంపదను అందించే గ్రహంగా చెప్పుకుంటారు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శని దేవుడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు. జూన్ 2027 వరకు ఆయన అక్కడే ఉంటాడు. ఇక శుక్రుడు జనవరి 13, 2026న మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జనవరి 15, 2026న, శుక్ర, శని గ్రహాలు 90 డిగ్రీల కోణంలో ఉండి… లాభ దృష్టి యోగాన్ని సృష్టిస్తాయి. ఈ యోగం ఎంతో మంచిది. కొన్ని రాశుల వారికి ఇది ఎంతో బీభత్సంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి కెరీర్ లో విజయం, ఆర్థికంగా పురోగతి, కుటుంబానికి సంతోషం వంటివి లాభిస్తాయి.
24
కుంభ రాశి
కుంభరాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. శని శుక్రులు కలిపి ఏర్పరచే లాభ-దృష్టి యోగం కుంభ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. వీరికి ఆర్థికంగా బలపడే కాలం రాబోతోంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. గట్టిగా ప్రయత్నిస్తే కచ్చితంగా విదేశాలకు వెళతారు . వీరి ఆదాయం కూడా పెరుగుతుంది. వీరికి మంచి ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారపరంగా కూడా వీరికి లాభాలు వస్తాయి.
34
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ సంక్రాంతి నుంచి మంచి కాలం మొదలవుతుంది. ఈ లాభ దృష్టి యోగం వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి జీతం, ఆదాయం పెరుగుతుంది. మీరు ప్రయత్నిస్తే కొత్త ఉద్యోగావకాశాలు మీకు ఎదురొస్తాయి. అలాగే ప్రమోషన్, జీతంలో పెరుగుదల వంటివి జరిగే అవకాశం ఉంది. అప్పుడు వ్యక్తుల దగ్గర నిలిచిపోయిన డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది. పెళ్లి కానికి వారికి వివాహం సెటిలయ్యే అవకాశం ఉంది.
కొత్త ఏడాదిలో లాభ దృష్టి యోగం మిథున రాశికి బాగా కలిసివస్తుంది. వీరికి భౌతిక సుఖాలు దక్కుతాయి. వీరికి పూర్వీకుల ఆస్తి నుండి లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ రాశిలో వ్యాపారం చేస్తున్నవారికి పురోగతి, ఆర్థిక లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగం రాని వారికి ఈ ఏడాది మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.