Shani: శని దేవుడికి ఇష్టమైన రాశులు ఇవే, ఈ రాశులవారిపై కాస్త ప్రేమ ఎక్కువే

Published : Apr 17, 2025, 03:55 PM IST

శని అంటేనే అందరూ భయపడతారు. శని వల్లే తమ రాత ఇలా ఉంది అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ, శని గ్రహానికి ఫేవరేట్  రాశులు ఉంటాయి అని మీకు తెలుసా?

PREV
15
Shani: శని దేవుడికి ఇష్టమైన రాశులు ఇవే, ఈ రాశులవారిపై కాస్త ప్రేమ ఎక్కువే


జోతిష్యశాస్త్రం ప్రకారం శని దేవుడిని కర్మ ఫలాల దాతగా పిలుస్తారు. శని గ్రహం రాశులను మార్చుకున్న ప్రతిసారీ దాని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. అందుకే, ఈ రాశి విషయంలో అందరూ ఎక్కువగా భయపడుతూ ఉంటారు. కానీ, ఈ స్వామికి మాత్రం కొన్ని ఇష్టమైన రాశులు ఉన్నాయి. ఆ రాశులేంటో చూద్దాం..

25
telugu astrology

1.వృషభ రాశి..


వృషభ రాశి కి అధిపతి శుక్రుడు. అయినప్పటికీ.. ఈ రాశి అంటే శనికి బాగా ఇష్టం. ఎందుకంటే.. శుక్ర గ్రహానికి, శనికి మంచి స్నేహ బంధం ఉంటుంది. అందుకే, ఈ రాశిపై శని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.వీరు జీవితంలో అన్నివిధాలా సుఖాలను, భౌతిక ఆనందాలను అనుభవిస్తారు. వీరు ఎల్లప్పుడూ ఐశ్వర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. వీరికి ధనం కొరత ఉండదు. జీవితంలో కీలక దశల్లో మంచి విజయాలు సాధిస్తారు.
 

35
telugu astrology

2.తుల రాశి..

తులా రాశి వారిపై శని దేవుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. శని ఉచ్ఛ రాశి తులారాశి కావడంతో శని వీరికి శుభ ఫలితాలనిస్తాడు. తులారాశి వారు శ్రమజీవులు, కష్టజీవులు. శనిదేవుడు కష్టజీవులను ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు. తులారాశి వారి జాతకంలో శని లేదా శుక్రుడు బలంగా ఉంటే, వారికి అన్ని రంగాల్లో శుభ ఫలితాలు లభిస్తాయి.
 

45
telugu astrology

మకర రాశి..

మకర రాశి అధిపతి శని. కాబట్టి ఈ రాశి వారిపై శని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. శనిదేవుడు వీరిపై తన కృపాదృష్టిని కలిగి ఉంటాడు. వీరు చాలా కష్టజీవులు. వారి శ్రమకు తగిన ఫలితం పొందుతారు. అదృష్టవంతులైన వీరు తమ లక్ష్యాలను సాధించి ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

55
telugu astrology

కుంభ రాశి.

కుంభ రాశి అధిపతి శని. కాబట్టి ఈ రాశి వారిపై శని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. కష్టపడి పనిచేసి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరి అదృష్టం ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. ధనం, సంతోషం కోసం కృషి చేస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories