Astrology: ఈ 4 రాశుల వారు బంగారు ఉంగరం ధరిస్తే.. జీవితం జిగేల్‌ మనడం ఖాయం.

Published : Apr 17, 2025, 02:50 PM IST

భారతీయులను, బంగారాన్ని విడదీసి చూడలేం. అందుకే బంగారం ధర ఎంత పెరిగినా, దానికి డిమాండ్‌ తగ్గదు. బంగారం కేవలం అలంకరణ వస్తువుగానే కాకుండా భవిష్యత్తుకు భరోసానిచ్చే పెట్టుబడి మార్గంగా కూడా చాలా మంది నమ్ముతుంటారు. ఇక ఒంటిపై కాస్తయినా బంగారం ఉండాలని చెబుతుంటారు. అయితే జ్యోతిష్యం కూడా ఇదే చెబుతుంది.  

PREV
15
Astrology: ఈ 4 రాశుల వారు బంగారు ఉంగరం ధరిస్తే.. జీవితం జిగేల్‌ మనడం ఖాయం.
Gold ring

బంగారం కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదని దీనికి జ్యోతిష్యంతో కూడా సంబంధం ఉందని నిపుణులు చెబుతుంటారు. అందుకే కొన్ని రకాల పూజల్లో బంగారు లోహాన్ని ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రంలో బంగారానికి బృహస్పతి గ్రహంతో అనుబంధం ఉంటుంది. కొన్ని రకాల రాశుల వారు బంగారాన్ని ధరించడం ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

25

మీన రాశి: 

మీన రాశి వారు కచ్చితంగా బంగారు ఉంగరాన్ని ధరించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. వీరికి బంగారం కలిసొస్తుంది. మీన రాశి వారి మానసిక ఆరోగ్యంపై బంగారం ప్రభావం పడుతుందని చెబుతుంటారు. ఈ రాశి వారు బంగారాన్ని ధరిస్తే ప్రేమ, అదృష్టం వంటివి కలిసొస్తాయి. 

 

35

సింహరాశి: 

సింహరాశి వారికి కూడా బంగారం ఎంతగానో కలిసొస్తుంది. సహజంగానే సింహరాశిలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఇలాంటి వారు బంగారు ఉంగరాన్ని ధరిస్తే వారి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఈ రాశి వారి వ్యక్తిత్వానికి అదనంగా బలం చేకూరుతుంది. వీరు బంగారు ఉంగరాన్ని ధరిస్తే పనిచేసే చోట గౌరవం లభిస్తుంది. 
 

45
Sagittarius
ధనుస్సు రాశి:  ఈ రాశి వారు కచ్చితంగా బంగారు ఉంగరాన్ని ధరించాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే పనిచేసే చోట మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు గోల్డ్‌ రింగ్‌ను ధరిస్తే పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. విద్యాప్రయాణాల్లో కూడా కలిసి వస్తుంది.  
55

మేష రాశి: 

కచ్చితంగా బంగారు ఉంగరాన్ని ధరించాల్సి వాళ్లలో మేష రాశి వారు కూడా ఒకరని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సహజంగా మేష రాశి వారిలో కొంత దూకుడు స్వభావం ఉంటుంది. ఇలాంటి వాళ్లు బంగారు ఉంగరాన్ని ధరిస్తే ఆ స్వభావం తగ్గుతుంది. ఇది వారిలో శక్తిని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పాజిటివ్‌ ఆలోచనలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories