పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. పెళ్లి బంధంలో ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తారు. కష్ట, సుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటారు. మనసులు తెలుసుకొని ప్రవర్తిస్తుంటారు. ఇద్దరిలో ఒక్కరి ప్రవర్తన తేడాగా ఉన్న ఆ బంధంలో మనస్ఫర్థలు రావడం ఖాయం. సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు గొడవలు పెట్టుకునే భార్యలే వస్తారట. మరీ ఆ తేదీల్లో మీరుగానీ.. మీకు తెలిసిన వారు కానీ.. జన్మించారో ఓసారి చెక్ చేస్కోండి.
సంఖ్యా శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి తన ప్రేమ, పెళ్లి జీవితానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు ముందుగానే సమాధానం తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎలాంటి జీవిత భాగస్వామిని పొందుతారనే దాని గురించి కూడా సంఖ్యా శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. నిజానికి న్యూమరాలజీ వ్యక్తి భవిష్యత్ గురించి అనేక రహస్యాలను వెల్లడిస్తుంది.
24
ఈ తేదీల్లో పుట్టిన వారు భార్య మాటే వింటారు!
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారికి అధిపతి చంద్రుడుగా పరిగణించబడుతుంది. ఈ వ్యక్తులు తమ భార్యల సలహా తీసుకున్న తర్వాతే ప్రతి పని చేస్తారు. ఎందుకంటే వారి భార్యలు వారిని నియంత్రిస్తారు. ఈ వ్యక్తుల జీవితంలో వారి భార్య పాత్ర చాలా ముఖ్యమైంది. వారు తమ భార్యలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోలేరు.
34
ఈ తేదీల్లో పుట్టిన వారికి గొడవలు చేసే భార్యలొస్తారు!
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారికి అధిపతి గురువుగా పరిగణించబడుతుంది. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకి గొడవలు చేసే భార్యలు వచ్చే అవకాశం ఎక్కువ. వారి భార్య ఇంటిని శాసిస్తుంది. వారు తమ భార్యలకు వ్యతిరేకంగా వెళ్తే.. ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతాయి.
44
ఈ తేదీల్లో పుట్టిన వారికి భార్యతో ఇబ్బందులు!
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారికి అధిపతి బుధుడుగా పరిగణించబడుతుంది. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు బుధ గ్రహ ప్రభావానికి ఎక్కువగా లోనవుతారు. ఈ వ్యక్తులు తమ భార్యల వల్ల ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకంటే వారి భార్యలు కఠిన స్వభావాన్ని కలిగి ఉంటారు.