శని, చంద్రుల కలయిక.. ఈ 3 రాశుల వారికి అన్నీ కష్టాలు, నష్టాలే!

Published : Sep 26, 2025, 12:51 PM ISTUpdated : Sep 26, 2025, 01:04 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒకదానితో మరొకటి కలిసి శుభ, అశుభ యోగాలు సృష్టిస్తుంటాయి. శుభ యోగాల వల్ల మంచి జరిగితే.. అశుభ యోగాల వల్ల చెడు ఫలితాలు వస్తాయి. త్వరలో శని, చంద్రుల కలయిక జరగనుంది. దానివల్ల 3 రాశులవారికి కష్టాలు మొదలుకానున్నాయి. 

PREV
14
శని, చంద్రుల కలయిక

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సమయానుసారం గ్రహాలు రాశులు, నక్షత్రాలు మారుస్తుంటాయి. ఇతర గ్రహాలతో కలిసి శుభ, అశుభ యోగాలు ఏర్పరుస్తుంటాయి. అక్టోబర్ 6వ తేదీ ఉదయం.. శని, చంద్రుడు కలిసి అశుభ యోగాన్ని సృష్టించనున్నాయి. సాధారణంగా చంద్రుడు భావోద్వేగాలు, మనసు, ప్రేమకు కారకుడు. శని.. బాధ్యత, కర్మ, పరిమితులు, పరీక్షలు, ఆటంకాలకు కారకుడు. ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడటం వల్ల.. బంధాల్లో బలహీనత, ఆలోచనల్లో మార్పు, నిరాశ, ఆందోళన బాధలు ఉత్పన్నమవుతాయి.

శని, చంద్రుల కలయిక కొన్ని రాశుల వారికి సవాలుగా మారనుంది. జాగ్రత్తగా లేకపోతే తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఏ రాశులవారికి అశుభ ఫలితాలు ఉన్నాయో.. వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.. 

24
మేష రాశి

మేషరాశికి శని, చంద్రుల కలయిక శుభప్రదం కాదు. ఈ యోగం మేషరాశి పన్నెండవ ఇంట్లో ఏర్పడటం వల్ల ఖర్చులు, నష్టాలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. నిరాశ పెరుగుతుంది. ఫలితంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రతి పనిలో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పై అధికారులతో వినమ్రంగా వ్యవహరించాలి. ఆర్థిక విషయాలకు సంబంధించి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

34
సింహ రాశి

శని, చంద్రుల అశుభ యోగం సింహ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. సింహ రాశి ఎనిమిదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడటం వల్ల ఆరోగ్యం సహకరించదు. ఆర్థిక పరిస్థితి అస్సలు అనుకూలించదు. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. నిరాశ పెరుగుతుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు. కుటుంబ వాతావరణం గంధరగోళంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. 

44
మీన రాశి

మీనరాశి వారికి శని, చంద్రుల కలయిక మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఈ రాశి మొదటి ఇంట్లో యోగం ఏర్పడటం వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మానసిక ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పటివరకు చకచకా జరిగిన పనులు కూడా అడ్డంకుల వల్ల ఆలస్యమవుతాయి. ఇతరులతో మాట పడాల్సి వస్తుంది. వైవాహిక జీవితం, భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వాములతో వివాదాలకు వెళ్లకపోవడమే మంచిది. 

Read more Photos on
click me!

Recommended Stories