Solar Eclipse: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? జాగ్రత్త ఈ విషయాలు మర్చిపోవద్దు

Published : Apr 09, 2025, 05:56 PM IST

Second Solar Eclipse 2025: మొదటి సూర్యగ్రహణం లాగే, ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం కూడా ఇండియాలో కనిపించదు. 2025లో వచ్చే రెండో సూర్యగ్రహణం ఆస్ట్రేలియా నుండి అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే, ఈ రెండో సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది? భారత్ లో కనిపించే ప్రభావం సహా మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
15
Solar Eclipse: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? జాగ్రత్త ఈ విషయాలు మర్చిపోవద్దు
solar eclipse .jpg

Second Solar Eclipse 2025: భారతీయ సాంప్రదాయంలో గ్రహణాలకు చాలా ప్రముఖ్యత ఉంది. వీటితో ముడిపడి అనేక విషయాలు జరుగుతాయని మన భారతీయ పురాణాలు చెబుతున్నాయి. అయితే, ఈ ఏడాదిలో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడనున్నాయి. వాటిలో 2 సూర్య గ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు గ్రహణాలు పూర్తయ్యాయి. వాటిలో మొదటి గ్రహణం మార్చి 14న సంపూర్ణ చంద్రగ్రహణంగా వచ్చింది.

25
Second Solar Eclipse:date and time solar eclipse 2025 in India

ఆ తర్వాత రెండో గ్రహణం మార్చి 29న పాక్షిక సూర్యగ్రహణంగా వచ్చింది. ఇది ఉత్తర అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియాలో కనిపించింది. కానీ, ఇండియాలో కనిపించలేదు. ఇక ప్రస్తుతం మిగిలిన రెండు గ్రహణాలు మరీ ముఖ్యంగా సూర్య గ్రహణం  ఎప్పుడు వస్తుందనే ఆసక్తి నెలకొంది. భారత్ రాబోయే సూర్య గ్రహణం కనిపిస్తుందా? లేదా? అనే విషయాలు కూడా ప్రజల్లో ఆసక్తిని పెంచాయి. ఈ ఏడాదిలో వచ్చే 2వ సూర్య గ్రహణం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

35
Second Solar Eclipse:date and time solar eclipse 2025 in India

2025లో రెండో సూర్య గ్రహణం ఎప్పుడు వస్తుంది? భారత్ లో కనిపిస్తుందా? లేదా? 

మొదటి సూర్య గ్రహణం భారత్ లో కనిపించని క్రమంలో రెండు సూర్య గ్రహణం కనిపిస్తుందా? లేదా? అనే విషయాలు ఆసక్తిని పెంచాయి. ఆ వివరాలు గమనిస్తే.. 2025 ఏడాదిలో 2వ సూర్య గ్రహణం సెప్టెంబర్ 21న అమావాస్యా రోజున సంభవించనుంది. ఈ సూర్య గ్రహణం సెప్టెంబర్ 21న రాత్రి 11 గంటల నుండి సెప్టెంబర్ 22న తెల్లవారు ఝామున 3:24 గంటల వరకు ఉంటుంది. అంటే 4 గంటలు 24 నిమిషాల పాటు కొనసాగే సుదీర్ఘ సూర్య గ్రహణం ఇది. 

2025లో వచ్చే రెండో సూర్య గ్రహణం మొదటి సూర్య గ్రహణం లాగే భారత్ దేశంలో కనిపించే అవకాశాలు లేవు. ఈ ఏడాదిలో వచ్చే రెండో సూర్యగ్రహణం ఇండియాలో కనిపించదు కానీ, ఆస్ట్రేలియా, యాంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం సహా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది.

45
Second Solar Eclipse:date and time solar eclipse 2025 in India

సూర్యగ్రహణం సమయంలో పూజలతో పాటు  చేయకూడని పనులేంటి? ఎందుకు చేయకూడదు?

హిందూ ధార్మిక నమ్మకాల ప్రకారం, సూర్య గ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో సూర్యుడు లేదా చంద్రుడు ప్రభావితమవుతారు, అందువల్ల సూర్యచంద్రుల శక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఈ సమయంలో పూజలు లేదా శుభకార్యాలు చేయడం వల్ల శుభ ఫలితాలు రావని నమ్ముతారు. అలాగే, గ్రహణం సమయాల్లో ప్ర‌కృతిలో ప్రతికూల శక్తుల ప్రభావం పెరుగుతుందనీ, అదే సమయంలో మంచి శక్తులు బలహీనంగా మారుతాయని నమ్ముతారు.

55
Second Solar Eclipse:date and time solar eclipse 2025 in India

అందుకే గ్రహణ సమయంలో ఎలాంటి శుభకార్యాలు లేదా పూజలు చేయరాదని చెబుతారు. ఈ సమయంలో ధార్మిక గ్రంథాలను అధ్యయనం చేయాడంతో మంచి జరుగుతుందని నమ్మకం. అంటే భగవంతుని ధ్యానం, మంత్ర జపంతో ప్రతికూల శక్తి మన దగ్గరకు రాదని భావిస్తారు. గ్రహణ కాలంలో గర్భవతులు బయటకు రావడం వల్ల చెడు కలుగుతుందని భావిస్తారు. అలాగే, భోజనం కూడా చేయరాదని హిందూ పురాణాలు, మత విశ్వాసాలు చెబుతున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories