Today Horoscope: తులరాశి వారికి ఈరోజు ఈ విధంంగా డబ్బు అందుతుంది

Published : Sep 10, 2025, 08:05 AM IST

తులా రాశివారి బుధవారం రాశిఫలాలు ఇవి. మరి , ఈ రోజు తుల రాశివారికి ఆర్థికంగా, ఉద్యోగ-వ్యాపారాల్లో, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందో చూద్దాం.. 

PREV
13
తులారాశి ఫలితాలు

ఈ రోజు తులారాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. ఈ రోజు వీరికి అన్ని రంగాల్లో శుభప్రభావం కనబడుతుంది. వీరి ప్రతిభ కొత్త అవకాశాలను అందేలా చేస్తుంది. ఈ రోజు తులా రాశివారు వృత్తి, వ్యాపారం, కుటుంబం, ఆర్థికం అన్నింటిలోనూ అనుకూల ఫలితాలను పొందుతారు.

23
ఆర్థిక పరిస్థితి

తులారాశి వారు ఈ రోజు ఆర్థిక పరంగా సంతృప్తికరంగా ఉంటారు. బాకీలన్నీ సర్దుబాటు అవుతాయి. దీంతో రోజువారి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. కొత్త కొత్త దారుల నుంచి డబ్బు వస్తుంది. పెట్టుబడులు లాభాదాయకంగా ఉంటాయి. అమ్మకాలు, కొనుగోలూ మీకు అనుకూలంగా ఉంటుంది. మొత్తంగా తులారాశివారి ఆర్థిక పరిస్థితి లాభాదాయకంగా ఉంటుంది.

ఉద్యోగం, వ్యాపారం

ఉద్యోగుల ప్రతిభ ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. మీ కృషి ఫలిస్తుంది. ఉన్నతాధికారుల ప్రశంసలను అందుకుంటారు. మీ పట్ల గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ నిర్ణయాలకు, సూచనలకు ఎంతో విలువ ఉంటుంది. సమావేశాల్లో మీ మాటలకు ప్రాధాన్యం ఉంటుంది. రాజకీయ రంగాలకు చెందిన వారికి ఎన్నో ఆహ్వానాలు అందుతాయి. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. ఇకపోతే ఈ రోజు వ్యాపారాలు ఈ రోజు సజావుగా సాగుతాయి. ఆగిపోయిన ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం బాగుంటుంది. మొండి బాకీలు వసూలు కావడంతో ఒత్తిడి తగ్గుతుంది. భాగస్వామ్య వ్యాపారం లాభాల్లో నడుస్తుంది.

33
ఆరోగ్యం

తులారాశి వారికి ఈ రోజు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలేమీ రావు. కానీ అలసట ఇబ్బంది పెడుతుంది. అదికూడా సగం రోజువరకే ఉంటుంది. వ్యాయామం, ధ్యానంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. మంచి ఆహారం తీసుకుంటే బలహీనత పోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories