Saturn Transit : 2026 హోలీ తర్వాత మీన రాశిలో శని అస్తమించబోతున్నాడు. దీనివల్ల ధనుస్సు, కుంభం, మీన రాశి వారికి ఉద్యోగ, ఆర్థిక పరంగా అదృష్టం వరించనుంది. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
జ్యోతిష శాస్త్రంలో శనిని క్రమశిక్షణకు, బాధ్యతకు అధిపతిగా పరిగణిస్తారు. నవగ్రహాలలో శని దేవుని గమనం అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఆయన ఇచ్చే ఫలితాలు మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. శని దేవుడు మన కర్మల ఆధారంగా ఫలితాలను అందజేస్తాడు. ఈ ఏడాది ఒక అద్భుతమైన ఖగోళ మార్పు జరగబోతోంది. హోలీ పండుగ ముగిసిన తర్వాత, శని దేవుడు మీన రాశిలో అస్తమించబోతున్నాడు. ఈ మార్పు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానుంది.
25
ఏళ్ల తర్వాత శని గ్రహం కీలక మార్పులు
సాధారణంగా శని గ్రహం మనిషి ఆరోగ్యం, ఆయుష్షు, చేసే వృత్తి, వ్యాపారం, ఇనుము, చమురు రంగాలపై ప్రభావం చూపుతుంది. దృక్ పంచాంగం ప్రకారం, 13 మార్చి 2026 సాయంత్రం 7:13 గంటలకు శని దేవుడు మీన రాశిలో అస్తమించబోతున్నాడు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత శని తన స్థితిలో ఇంత పెద్ద మార్పు చేయడం విశేషం. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ, ముఖ్యంగా మూడు రాశుల వారికి మాత్రం ఇది గోల్డెన్ పీరియడ్‌గా మారబోతోంది. ఉద్యోగం, ఆర్థిక స్థితి, పురోగతిలో వీరు ఊహించని విజయాలు అందుకుంటారు.
35
ధనుస్సు రాశి: విలాసవంతమైన జీవితం మీ సొంతం
శని అస్తమయం ధనుస్సు రాశి వారికి అదృష్ట ద్వారాలను తెరుస్తుంది. ఈ సమయంలో వీరి భౌతిక సుఖాలు పెరుగుతాయి. మీరు కొత్త ఇల్లు, కారు లేదా ఏదైనా విలువైన ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన వివాదాలు ఏవైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి.
కెరీర్ పరంగా చూస్తే, ఉద్యోగ మార్పు కోసం ఎదురుచూస్తున్న వారికి అద్భుతమైన ఆఫర్లు లభిస్తాయి. ఆదాయం పెరగడంతో పాటు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి.
కుంభ రాశి వారికి ఈ శని అస్తమయం ఎంతో ఊరటను కలిగిస్తుంది. గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ సమయం ఉపశమనాన్ని ఇస్తుంది. నిలిచిపోయిన సొమ్ము అనుకోకుండా మీ చేతికి అందుతుంది.
ముఖ్యంగా వ్యాపారస్తులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు వసూలవుతాయి. విద్య, మీడియా, సేల్స్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మాట తీరు, ఆలోచనలు ఇతరులను అమితంగా ఆకర్షిస్తాయి, దీనివల్ల సమాజంలో మీ పరపతి పెరుగుతుంది.
55
మీన రాశి: ఆత్మవిశ్వాసంతో వచ్చే విజయాలు
శని అస్తమయం మీన రాశిలోనే జరుగుతుండటంతో, ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహితులకు ఈ సమయం ఎంతో మధురంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి, అనుబంధం బలపడుతుంది.
మీ భాగస్వామికి కూడా ఈ కాలంలో కెరీర్ పరంగా గొప్ప పురోగతి లభించవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు పెరుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి లాభాలు వస్తాయి.
రాబోయే కాలంలో శని అనుగ్రహం
శని దేవుడు మీన రాశిలో అస్తమించే ఈ కాలం క్రమశిక్షణతో ఉండేవారికి మేలు చేస్తుంది. హోలీ తర్వాత ప్రారంభమయ్యే ఈ ప్రభావం వల్ల వృత్తిపరమైన ఎదుగుదల కనిపిస్తుంది. పై మూడు రాశుల వారు ఈ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో స్థిరమైన ఆర్థిక స్థితిని సాధించవచ్చు. శని ప్రభావం వల్ల కలిగే ఈ మార్పులు జీవితంలో కొత్త వెలుగులను నింపుతాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.