జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తమ రాశి, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. ఈ మార్పు వల్ల కొన్ని రాశి చక్రాలకు మంచి జరిగితే.. మరికొన్ని రాశుల వారికి నష్టాలు వస్తాయి. అన్ని గ్రహాల్లో శని చాలా ముఖ్యమైంది. ప్రత్యేకమైంది కూడా. శని తన రాశిని మార్చినప్పుడు చంద్రుడు రెండవ దశలో ఉంటాడు.
ఈ రాశుల వారికి ఊహించని లాభాలు!
ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఊహించని లాభాలను పొందుతారట. వారి అభివృద్ధి పెరుగుతుందట. అప్పటి వరకు వారు అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోతాయట. ఊహించని ఆర్థిక లాభాలను ఆశించవచ్చట. ఈ ప్రభావం 2025 నుంచి 2027 వరకు కొనసాగుతుందట. అంతటి అదృష్టాన్ని పొందే ఆ రాశులెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశికి శని మార్పు ఎలా ఉంటుంది?
కర్కాటక రాశికి చెందిన వారికి శని దేవుడి వెండి పాదం ఉంటుంది. డబ్బు పర్వతంలా పేరుకుపోతుంది. ఆర్థికాభివృద్ధి చూడవచ్చు. ఇది ఉద్యోగం, వ్యాపారంలో రెట్టింపు లాభాన్ని తెస్తుంది. వీరికి ఇదివరకు చూడని విధంగా డబ్బు చూసే యోగం కలుగుతుంది.
వృశ్చిక రాశిపై ప్రభావం
జ్యోతిష్యం ప్రకారం వృశ్చిక రాశి వారికి శని మార్పు వల్ల జీవితంలో మంచి సమయం వస్తుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. ఈ రాశి వారికి శని దేవుడి ఆశీర్వాదం లభిస్తుంది. డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఒక విధంగా చెప్పాలంటే డబ్బు వర్షంలా కురుస్తుందట. అన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయట.
కుంభ రాశి జీవితం మారుతుంది..
కుంభ రాశికి ఈ శని మార్పు చాలా ప్రయోజనాలను తెస్తుంది. పనిలో పదోన్నతి లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వారి ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రాశిచక్రం గ్రహం శని. కాబట్టి వారికి అన్నీ మంచి జరుగుతాయి. కుంభ రాశి వారికి ఇది మంచి ప్రారంభం అవుతుంది. పనిలో పురోగతి ఉంటుంది.