Saturn Transit: సొంత నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి కష్టాలకు చెక్, అన్నీ మంచి రోజులే!

Published : Sep 04, 2026, 05:40 PM IST

Saturn Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాదాపు 27 ఏళ్ల తర్వాత శని గ్రహం తన సొంత నక్షత్రంలోకి ప్రవేశించనుంది. ఈ మార్పుతో కొన్ని రాశులవారికి వృత్తిలో పురోగతి, ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలు రానున్నాయి. మరి శని దేవుడి అనుగ్రహం పొందే రాశులేవో చూడండి.

PREV
15
సొంత నక్షత్రంలోకి శని గ్రహం

జ్యోతిష్య శాస్త్రంలో శనిని కర్మ, బాధ్యత, క్రమశిక్షణ, కష్టానికి ప్రతీకగా భావిస్తారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత శని తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్రలోకి ప్రవేశించనుంది. ప్రస్తుతం రేవతి నక్షత్రంలో సంచరించరిస్తున్న శని, తన వక్ర గమనం కారణంగా అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగో పాదంలోకి ప్రవేశిస్తాడు. శని నక్షత్ర మార్పు వల్ల 4 రాశులవారికి కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, సామాజిక హోదా వంటి విషయాల్లో మంచి మార్పులు వస్తాయి. మరి ఆ రాశులేవో చూసేయండి.

25
మకర రాశి

మకర రాశికి అధిపతి శని కాబట్టి, ఈ నక్షత్ర సంచారం మీకు చాలా ముఖ్యమైంది. పని చేసే చోట మీకు అదనపు బాధ్యతలు అప్పగించవచ్చు. మీ పనితీరు, పట్టుదలకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా బలపడుతుంది. శని ప్రభావం ఉన్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ప్రణాళికతో ముందుకు వెళ్తే మంచి పురోగతి ఉంటుంది.

35
మిథున రాశి

మిథున రాశి వారికి శని ఉత్తరాభాద్ర సంచారం వృత్తిపరంగా కొత్త అవకాశాలు తెస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరగవచ్చు. మొదట్లో ఇది అదనపు పనిభారంగా అనిపించినా, దీని ద్వారా మీ ప్రతిభ బయటపడి పదవి, గౌరవం పెరిగే అవకాశం ఉంది. మీ క్రమశిక్షణ, నిరంతర కృషికి పై అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారం చేసే వారికి వృద్ధి నెమ్మదిగా ఉన్నా స్థిరంగా ఉంటుంది. అయితే, పెద్ద పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా, లాభనష్టాలను విశ్లేషించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

45
వృషభ రాశి

వృషభ రాశి వారికి శని నక్షత్ర సంచారం వృత్తి జీవితంలో మార్పులకు అవకాశాలు కల్పిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా ఒక ముఖ్యమైన బాధ్యత లభించవచ్చు. కంపెనీ మారాలని ప్లాన్ చేస్తున్న వారికి కూడా తగిన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీ ప్రతిభను నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సరైన ప్రణాళికతో, పట్టుదలతో ప్రయత్నిస్తే కెరీర్‌లో మంచి పురోగతి సాధించవచ్చు.

55
తుల రాశి

తుల రాశి వారికి శని నక్షత్ర సంచారం వృత్తి, వ్యాపారాల్లో అనుకూలమైన మార్పులకు దారితీస్తుంది. మీ దీర్ఘకాల అనుభవం, బాధ్యత, కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. ప్రమోషన్, జీతం పెంపు లేదా ముఖ్యమైన బాధ్యత వంటి అవకాశాలు రావచ్చు. వ్యాపారాన్ని విస్తరించాలనే మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అయితే కొత్త ఒప్పందాలపై సంతకం చేసేటప్పుడు అన్ని నిబంధనలను జాగ్రత్తగా చదివిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories