శని గ్రహం తిరోగమన దశ మొదలుకానుంది. అన్ని గ్రహాల్లో కెల్లా శని చాలా నెమ్మదిగా కదులుతుంది. ఏదైనా రాశిలోకి అడుగుపెట్టింది అంటే కనీసం రెండున్నర సంవత్సరాలు అదే రాశిలో ఉంటుంది.రీసెంట్ గానే కుంభ రాశిని వదిలేసి మీన రాశిలోకి అడుగుపెట్టింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ రాశిలోకి అడుగుపెట్టింది. అయితే, ఈ రాశిలో శని తిరోగమనం మాత్రం జులై 13 వ తేదీన జరగనుంది. మళ్లీ 2027 వరకు ఇదే రాశిలో శని తిరోగమనం కంటిన్యూ అవుతుంది. కాగా, జోతిష్య శాస్త్రంలో శని గ్రహాన్ని కర్మఫలదాతగా భావిస్తారు. ఇది క్రమశిక్షణ, న్యాయం, బాధ్యతలతో ముడిపడి ఉంటుంది. మరి, ఈ తిరోగమనం మూడు రాశులకు మాత్రం చాలా మేలు చేయనుందట. మరి, ఆ రాశులేంటో చూద్దామా..