ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 2 నుంచి మంచి రోజులు మొదలవుతాయి. ఈ రాశి వారి నాలుగో ఇంట్లో శని, కుజుడి కలయిక జరుగుతుంది. దీనివల్ల వీరి కెరీర్‌లో మంచి పురోగతి ఉంటుంది. ఊహించని లాభాలు రావచ్చు. ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారికి ఆ కష్టాల నుంచి బయటపడతారు. కొంతమేర డబ్బు కష్టాలు తీరుతాయి. మీపై ఉన్న నిందలు, అపార్థాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ రావచ్చు, జీతంలో పెరుగుదల వంటివి జరుగుతాయి.