దిశ మార్చుకుంటున్న శని గ్రహం... ఈ రాశుల పేదరికం తీరినట్లే, ఆదాయం రెట్టింపు

Published : Oct 23, 2025, 05:17 PM IST

Shani Transit : నవంబర్ లో శని తాను కదిలే దిశను మార్చుకుంటున్నాడు. మీన రాశిలో నేరుగా కదలనున్నాడు. దీని కారణంగా,  కొన్ని రాశుల వారిని అదృష్టం వరించనుంది.  దాని కారణంగా వారి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి.  ఊహించని వైపు నుంచి డబ్బు వారికి అందుతుంది. 

PREV
15
Shani Transit

జోతిష్య శాస్త్రంలో శనిని అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. మనం చేసిన కర్మలకు తగిన ప్రతిఫలాన్ని శని ఇస్తూ ఉంటాడు.  శనిని న్యాయానికి అధిపతిగా కూడా భావిస్తారు. అయితే, శని గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం మీన రాశిలో వక్ర స్థితిలో కదులుతున్నాడు. నవంబర్ లో వక్ర స్థితిని మార్చి, సరైన దిశలో కదులుతాడు. దీని కారణంగా మూడు రాశులవారి జీవితాల్లో చాలా మార్పులు జరగనున్నాయి. మరి, ఆ రాశులేంటో చూద్దాం…

25
వృషభ రాశి

నవంబర్ లో శని ప్రత్యక్ష సంచారం వృషభ రాశి వారికి చాలా మేలు చేస్తుంది. ఇది వృషభ రాశి కి లాభ స్థానమైన 11వ ఇంట్లో ఉంది. దీని వల్ల ఊహించని లాభాలు పొందుతారు. ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది.  చేసే ప్రతి పనీ పూర్తి అవుతుంది. వ్యాపారంలో కచ్చితంగా విజయం సాధించగలరు.  కొత్త పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. ఎవరికి అయినా గతంలో డబ్బు ఇచ్చి ఉంటే ఆ డబ్బు మళ్లీ మీ చేతికి అందుతుంది. సమాజంలో గౌరవం, కుటుంబ మద్దతు లభిస్తుంది.

35
తులా రాశి

నవంబర్ లో తుల రాశివారి ఆరో ఇంట్లోకి శని నేరుగా ప్రయాణిస్తాడు. దీని వల్ల తుల రాశివారికి చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సమయంలో  ఈ రాశివారు విదేశాలు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారాలను విస్తరించడానికి ఇది అనువైన సమయం. వాహనం లేదా కొత్త వస్తువులు కొనే అవకాశం ఉంది. కుటుంబం నుంచి శుభవార్తలు వింటారు. 

45
కుంభ రాశి

కుంభ రాశి వారికి శని సంచారం ధన స్థానమైన రెండో ఇంట్లో జరుగుతుంది. దీని కారణంగా ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది.  ఆర్థికంగా మంచి పురోగతి లభిస్తుంది.  కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటాయి.  పొదుపు పెరుగుతుంది.  పూర్వీకుల ఆస్తి సమస్యలు పరిష్కారమౌతాయి. మీ మాట తీరు మెరుగుపడుతుంది.  ఉద్యోగంలో, సమాజంలో మంచి ఫలితాలు పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. 

55
ఈ రాశులకు కూడా మంచే జరుగుతుంది..

శని సంచారం వల్ల ఈ రాశులకే కాక, కొన్ని ఇతర రాశులకూ మంచి జరుగుతుంది. మేషం: వైవాహిక జీవితం బాగుంటుంది. మీనం: పనిభారం తగ్గుతుంది. ధనుస్సు: ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories