Saturn Combust: మీన రాశిలో అస్తమించబోతున్న శని, ఈ 3 రాశులవారి పంట పండినట్టే

Published : Feb 07, 2026, 06:09 PM IST

Saturn Combust:  మీనరాశిలో శని అస్తమించబోతున్నాడు. అసలు శని అస్తమయం అంటే ఏమిటి? దీని వల్ల ఏ రాశులకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి. అందులో మీ రాశి ఉంటే మీరు లక్కీ ఫెలో అని చెప్పుకోవాలి. 

PREV
14
శని అస్తమయం అంటే ఏమిటి?

జ్యోతిషశాస్త్రంలో శని చాలా శక్తివంతమైన గ్రహం. ఏలినాటి శని, దైయా ప్రభావాలను కలిగించే  శని గ్రహం అంటే ఎంతో మంది భయం కూడా. శని రాశులలో చాలా నెమ్మదిగా కదులుతూ ప్రయాణిస్తాడు. ఒక రాశి నుంచి ప్రయాణం మొదలుపెట్టాక తిరిగి అదే రాశికి చేరుకునే సరికి ఏకంగా 30 ఏళ్లు పడుతుంది. శని ఉదయం, అస్తమయం వంటి కూడ రాశి చక్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. మార్చి 13 నుంచి శని దేవుడు అస్తమిస్తున్నాడు. శని అస్తమయం కొన్ని రాశుల వారికి ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది.

ఏదైనా గ్రహం సూర్యుడికి చాలా దగ్గరగా వచ్చినప్పుడు ఆ స్థితిని అస్తమయంగా చెప్పుకుంటారు.  జ్యోతిషశాస్త్రంలో శుక్ర, గురు గ్రహాల అస్తమయాన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఈ సమయంలో, పెళ్లిళ్లు లేదా ఇతర శుభకార్యాలు చేయరు. సూర్యుని తీవ్రమైన ప్రకాశానికి గురైన గ్రహాల శక్తి ప్రభావం తగ్గిపోతుంది. అందుకే ఆ గ్రహాలు అస్తమించాయని అంటారు. మార్చిలో శని దేవుడు అస్తమించబోతున్నాడు. దీనివల్ల మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. 

24
ధనూ రాశి

ధనుస్సు రాశి వారు ప్రస్తుతం శని ప్రభావంలో ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి శని అస్తమయం ఎంతో శుభప్రదంగా మారబోతోంది. మీరు గతంలో చేయాలనుకుని ఆగిపోయిన పనులు పూర్తి కావడం మొదలవుతుంది. అలాగే వీరికి సంతోషం పెరుగుతుంది. వీరు అనుకోకుండా అకస్మాత్తుగా ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఏదైనా కొత్త ఉద్యోగ ప్రతిపాదన రావచ్చు. కొత్త పనిని ప్రారంభించవచ్చు. మార్చి 13 నుంచి మీకు మంచి కాలం మొదలవుతుంది.

34
మీన రాశి

మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ నడుస్తోంది. దీని వల్ల ఇప్పటికే వీరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వీరికి శని అస్తమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వీరి జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది. అలాగే వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరి కెరీర్‌లో విజయవంతంగా సాగడం మొదలవుతుంది. భాగస్వామ్య పనులలో ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

44
కుంభ రాశి

శని అస్తమయం అనేది కుంభ రాశి వారికి సుఖాలను తెచ్చే కాలం. వీరిపై సానుకూల ప్రభావం పడుతుంది. ఏలినాటి శని బాధల నుంచి వీరికి ఉపశమనం లభిస్తుంది. డబ్బు విషయంలో కూడా గతంలో కంటే బలంగా ఉంటారు. సంపాదన పెరగుతుంది. ఆగిపోయిన పనులు తిరిగి మొదలవుతాయి. ఆకస్మికంగా డబ్బు చేతికంటే అవకాశం ఉంది. ఇతర వ్యక్తుల దగ్గర చిక్కుకున్న డబ్బు తిరిగి రావచ్చు. వీరు భూమి, ఆస్తి వంటి విషయాలలో కొనే అవకాశం లేదా వారసత్వంగా పొందే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories