Solar Eclipse: మొదటి సూర్య గ్రహణం... ఈ రాశులవారికి అనుకోని కష్టాలు తప్పవు, జాగ్రత్తగా ఉండాల్సిందే

Published : Feb 07, 2026, 05:06 PM IST

 Solar Eclipse:ఈ ఏడాది మొదటి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న సంభవిస్తోంది. ఈ గ్రహణ ప్రభావం కొన్ని రాశులవారిపై చాలా ఎక్కువగా పడనుంది. ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

PREV
13
Solar Eclipse

జోతిష్యశాస్త్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలకు చాలా ప్రాముఖ్యత ఉంది. గ్రహాలలో మార్పులతో పాటు, శివరాత్రి, ఆ తర్వాత.. మొదటి సర్య గ్రహణం ఈ నెలలోనే ఏర్పడనుంది. ఫిబ్రవరి 17న ఫాల్గుణ మాస అమావాస్య రోజున ఈ సంవత్సరం మొదటి సూర్య గ్రహణం కుంభ రాశిలో సంభవిస్తుంది. ఈ గ్రహణం భారత్ లో కనిపించనప్పటికీ.. కొన్ని రాశుల వారికి మాత్రం అనుకోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...

23
ఈ రాశులకు అనుకోని సమస్యలు..

1.కర్కాటక రాశి..

సూర్య గ్రహణ సమయంలో కర్కాటక రాశివారు శారీరకంగా, మానసికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాహనం నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం తర్వాత కనీసం ఒక వారం పాటు ఎలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు. కొత్త పెట్టుబడులు లేదా వ్యాపారాలు చేయవద్దు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

2.కన్య రాశి...

కన్య రాశి వారికి, ఈ గ్రహణం ఆరో ఇంట్లో సంభవిస్తుంది. ఇది ఇంట్లో వ్యతిరేకత పెరగడానికి కారణం కావచ్చు. ఎవరినీ నమ్మద్దు. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి కావడానికి సమయం పడుతుంది. కాబట్టి, ఓపికగా ఉండాలి. ఈ గ్రహణం కారణంగా ఎక్కువ ఖర్చులు రావచ్చు. డబ్బు విషయంలో అజాగ్రత్తగా ఉండవద్దు. ప్రణాళిక లేకుండా ఖర్చు చేయకూడదు. ఆరోగ్య సమస్యలు రావచ్చు.

3.మీన రాశి..

మీన రాశి వారికి ఈ గ్రహణ సమయం అస్సలు బాలేదు. ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. నష్టాలు కూడా రావచ్చు. డబ్బు విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. వ్యాపారంలో సమస్యలు రావచ్చు. ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. ఎంత కష్టపడినా.. ఫలితం అనుకూలంగా రాకపోవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లాంటివి ఈ సమయంలో చేయకపోవడమే మంచిది.

33
కుంభ రాశిలోనే సూర్య గ్రహణం...

4.కుంభ రాశి..

ఈ ఏడాది సూర్య గ్రహణం కుంభ రాశిలో సంభవిస్తోంది. ఈ గ్రహణ సమయంలో బుధుడు, శుక్రుడు కూడా కుంభ రాశిలోనే ఉంటారు. ఇది కుంభ రాశి వారి మనసులో చాలా గందరగోళంగా ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. పెట్టుబడులలో కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉంది. ఒత్తిడి తగ్గించుకోవడానికి వ్యాయామం చేయడం మంచిది.

సింహ రాశి..

ఈ సూర్యగ్రహణం సింహ రాశి వారికి ప్రత్యేకంగా సవాలుగా ఉంటుంది. ఈ కాలంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కెరీర్ కి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories