Rich Zodiac signs: ఈ మూడు రాశుల వారిపై కుబేరుడి కరుణ, దీపావళికి ముందే మంచి రోజులు మొదలు

Published : Sep 05, 2025, 12:27 PM IST

దీపావళి అక్టోబర్ 20న రాబోతోంది. ఆరోజు లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని కూడా పూజిస్తారు. దీపావళికి ముందే ఆదిత్య మంగళ రాజ యోగం ఏర్పడబోతోంది. దీనివల్ల మూడు రాశుల వారికి ధనయోగం ఉంది. 

PREV
15
అరుదైన యోగం

జ్యోతిష్య శాస్త్రంలో అక్టోబర్ నెల ఎంతో ముఖ్యమైనది. ఈ నెలలో ఎన్నో గ్రహాలు తమ స్థితిని మార్చుకుంటాయి. దీపావళి రోజే లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజించిన భక్తులు ధన కనక వస్తు వాహనాది కోసం పూజిస్తారు. అక్టోబర్ 20న దీపావళి రాబోతోంది. దీపావళికి ముందే ఒక శక్తివంతమైన రాజ యోగం ఏర్పడుతోంది. ఇది కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదమైనది. సూర్యుడు కుజుడు కలయికతో ఆదిత్య మంగళ రాజ యోగం వస్తుంది. ఇది కొన్ని రాశుల వారి జీవితాల్లో అపారమైన సంపదను, ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకోండి.

25
తులా రాశిలో రాజయోగం

అక్టోబర్ 13న కుజుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా కుజుడు తులారాశిలోకి వెళ్లిన నాలుగు రోజుల తర్వాత అంటే అక్టోబర్ 17న గ్రహాల రాజు అయిన సూర్యుడు కూడా తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల సూర్యుడు, కుజుడు కలిసి ఆదిత్య మంగళ రాజయోగాన్ని సృష్టిస్తారు. ఈ రాజ యోగం మూడు రాశుల వారికి ఎంతో శుభాలను అందిస్తుంది.

35
మేష రాశి

మేష రాశి వారికి కుజుడు అధిపతి. ఇక కుజుడు సూర్యుడితో కలిసి ఆదిత్య మంగళ రాజు యోగాన్ని ఏర్పరుస్తాడు. కాబట్టి వీరికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారం చేసేవారికి ఇది ఉత్తమ సమయం అని చెప్పుకోవచ్చు. ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ఉద్యోగం చేసేవారికి ఆఫీసులో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో కూడా ఆనందం వెల్లివిరుస్తుంది.

45
వృషభ రాశి

వృషభ రాశి వారికి కుజుడు, సూర్యుడు కలయిక వల్ల ఏర్పడే ఆదిత్య మంగళ యోగం ఎన్నో శుభాలను అందిస్తుంది. వీరు పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలను సాధిస్తారు. వారికి ఉన్న వ్యాధులు కూడా నయమవుతాయి. కొత్త ఉద్యోగం దొరికే అవకాశం కనిపిస్తోంది. కెరీర్ లో వీరు గొప్ప విజయాలని అందుకుంటారు. ప్రతి పనిలోనే అదృష్టాన్ని పొందుతారు.

55
తులా రాశి

తులా రాశిలోకి కుజుడు, సూర్యుడు కలిసి ఆదిత్య మంగళ రాజయోగం ఏర్పరుస్తారు. దీనివల్ల తులారాశి వారికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. పెండింగ్ లో ఉన్న డబ్బులు కూడా చేతికిందుతాయి. మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త దారుల నుండి ఆదాయం కూడా మొదలవుతుంది. సుదీర్ఘ ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాజయోగం మీకు అన్ని రకాలుగా మేలే చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories