Rare Rajayoga: ఒకే రాశిలో రెండు అరుదైన రాజయోగాలు..3 రాశులకు కోటీశ్వరులు అయ్యే యోగం..!

Published : Jun 17, 2026, 09:01 AM IST

Rare Rajayoga: జోతిష్యశాస్త్రం ప్రకారం మిథున రాశిలో బుధాధిత్య రాజయోగం, భద్ర రాజయోగాలు ఏర్పడనున్నాయి.ఒకేసారి రెండు యోగాలు ఒకేరాశిలో ఏర్పడటం కొన్ని రాశుల వారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.  ప్రమోషన్స్ వచ్చే అవకాశం.  ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం.. 

PREV
13
మిథున రాశి..

బుధాదిత్య రాజయోగం, భద్ర రాజయోగ ప్రభావం మిథున రాశివారికి చాలా శుభ ఫలితాలను తెస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశివారికి ఆర్థికంగా బాగా కలిసిరానుంది.చాలా కాలంగా ఉద్యోగంలో ఏవైనా సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో తీరిపోయే అవకాశం ఉంది. సమస్యలన్నీ ఒకేసారి తగ్గడంతో.. ప్రశాంతంగా అనిపిస్తుంది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కెరీర్ లో మంచి విజయావకాశాలు అందుకుంటారు. ముఖ్యంగా అనుకోని విధంగా డబ్బులు అందుతాయి. వ్యాపారం చేసేవారికి సువర్ణ అవకాశాలు వస్తాయి.

23
సింహ రాశి..

బుధాదిత్య, భద్ర రాజయోగాలు సింహ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది.ఈ సమయం వీరికి చాలా అదృష్టకాలంగా మారుతుంది. ఈ సమయంలో అవకాశాలు మెరుగుపడతాయి.గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఉద్యోగం మారాలి అనుకునేవారికి ఇదే సరైన సమయం. అంతేకాదు.. మీరు చేసిన పనికి ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. కొత్త బాధ్యతలు చేపడతారు.పాత పెట్టుబడుల నుంచి ఇప్పుడు మంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారాలు చేసేవారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు భవిష్యత్తులో బాగా ఉపయోగపడతాయి.

33
ధనుస్సు రాశి..

బుధాదిత్య, భద్ర రాజయోగాలు ధనుస్సు రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న లక్ష్యాలను ఈ సమయంలో చేరుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలు చేసుకునేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలు వింటారు.మీ పనితీరును అధికారులు గుర్తిస్తారు. పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుకుంటారు. కొత్త అవకాశాలు అందుకుంటారు. పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుకుంటారు. ఊహించని విధంగా చేతికి అధిక మొత్తంలో డబ్బు అందుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories