Today Rasi Phalalu: నేడు ఓ రాశివారి ఆలోచనలు ఇంట్లో ఎవ్వరికీ నచ్చవు...!

Published : Jun 17, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 17.06.2026 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఇంటా బయటా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి.

313
వృషభ రాశి ఫలాలు

దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఇంటా బయటా సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు.

413
మిథున రాశి ఫలాలు

చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి. నూతన వాహన యోగం ఉంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆర్థిక లాభాలు పొందుతారు. నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

613
సింహ రాశి ఫలాలు

కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణ యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. బంధువులతో విభేదాలు కలుగుతాయి.

713
కన్య రాశి ఫలాలు

వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నూతన రుణ యత్నాలు కలసిరావు. స్థిరాస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు. ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.

813
తుల రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. భూ వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

సంఘంలో పెద్దల నుంచి వివాదాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుతుంది. పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగులకు శాలరీ విషయంలో సానుకూల ఫలితాలుంటాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి.

1113
మకర రాశి ఫలాలు

డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. మీ ఆలోచనలు ఇంట్లో ఎవ్వరికీ నచ్చవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

1213
కుంభ రాశి ఫలాలు

సన్నిహితుల నుంచి కీలక విషయాలు తెలుసుకుంటారు. సంతనానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.

1313
మీన రాశి ఫలాలు

ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార భాగస్వామితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories