Rahu: ఈ 4 రాశులపై తన దుష్ట బుద్ధి చూపించనున్న రాహువు..వీరికి మానసిక ఒత్తిడి, ఆర్థిక నష్టం

Published : May 26, 2026, 10:08 AM IST

Rahu: జ్యోతిష శాస్త్రంలో రాహువును నీడ గ్రహంగా చెప్పుకుంటారు. ఇది అశుభ స్థానంలో ఉంటే ఎన్నో నష్టాలు కలుగుతాయి. మే 31న రాహువు నక్షత్రం మారబోతున్నాడు. దీనివల్ల నాలుగు రాశుల వారికి కష్టాలు తప్పకపోవచ్చు. 

PREV
15
రాహువు ఎఫెక్ట్

దుష్ట గ్రహంగా పేరు తెచ్చుకున్న రాహువు మే 31న శతభిషా నక్షత్రంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఆగస్టు 1 వరకు ఆ స్థానంలోనే ఉంటాడు. ఆ తర్వాత ధనిష్ట నక్షత్రంలోని నాలుగవ స్థానంలోకి ప్రవేశిస్తాడు. ధనిష్ట నక్షత్రానికి రాహువే అధిపతి. కాబట్టి ఈ మార్పు కూడా చాలా ముఖ్యమైనదిగానే చెప్పుకుంటారు. అయితే రాహువు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి నష్టాలు తప్పవు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

25
మేష రాశి

రాశిచక్రంలో మొదటి రాశి మేషం. రాహువు ప్రస్తుతం చేసే సంచారం ఈ రాశి వారికి ఏమాత్రం మంచిది కాదు. ఈ సమయంలో ఈ రాశి వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. వివాహితులు తమ జీవిత భాగస్వామితో గొడవలు పడే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. రాహు సంచార సమయంలో వాహనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనం చాలా జాగ్రత్తగా నడపాలి.

35
కర్కాటక రాశి

రాహు సంచారం కర్కాటక రాశి వారికి కాస్త హానికరమైనది. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారికి తీవ్ర నష్టం తప్పకపోవచ్చు. ఈ సమయంలో పనిచేసే చోట సహోద్యోగులతో తీవ్ర వివాదాలు జరగవచ్చు. అలాగే ఆస్తి సంబంధిత పనులకు కూడా అంతరాయం కలుగుతుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి కలుగుతుంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేసేవారు రోజువారీ ఆదాయంలో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు.

45
సింహ రాశి

రాహువు శతభిషా నక్షత్రంలోకి అడుగుపెట్టడం వల్ల సింహ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేస్తున్న వారికి ఆర్థిక నష్టాలు కనిపిస్తున్నాయి. అలాగే తండ్రితో మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగము, వ్యాపారం మారడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. ఇక పెళ్లయిన వారు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

55
వృశ్చిక రాశి

రాహువు నక్షత్ర మార్పు అనేది వృశ్చిక రాశి వారి వృత్తిపై ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో వృత్తి, ఉద్యోగాల్లో నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్న వారి పనితీరు క్షీణిస్తుంది. దీనివల్ల ఇబ్బందులు వస్తాయి. ఇక వ్యాపారంలో ఆర్థిక నష్టాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి పెద్ద పెట్టుబడులు ఈ కాలంలో పెట్టకపోవడమే మంచిది. అలాగే వివాదాలకు కూడా దూరంగా ఉండాలి.

Read more Photos on
click me!

Recommended Stories