ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
213
మేష రాశి ఫలాలు
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవచింతన పెరుగుతుంది. సన్నిహితులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి.
313
వృషభ రాశి ఫలాలు
అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు.
స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.
513
కర్కాటక రాశి ఫలాలు
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. వ్యాపారాలలో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.
613
సింహ రాశి ఫలాలు
ఇంటా బయటా కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆర్థికంగా చికాకులు తప్పవు. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.
713
కన్య రాశి ఫలాలు
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మిత్రులతో దైవదర్శనం చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారతారు. నూతన వాహన యోగం ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
813
తుల రాశి ఫలాలు
చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసివస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగులకు శాలరీ విషయంలో శుభవార్తలు అందుతాయి.
913
వృశ్చిక రాశి ఫలాలు
దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు తప్పవు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. కొన్ని వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి చేతిలో డబ్బు ఉండదు.
1013
ధనుస్సు రాశి ఫలాలు
అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
1113
మకర రాశి ఫలాలు
గృహ నిర్మాణం విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
1213
కుంభ రాశి ఫలాలు
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
1313
మీన రాశి ఫలాలు
ఆస్తి తగాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.