Mercury Transit: మిథునంలోకి బుధుడు.. ఈ 4 రాశుల వారికి ఉద్యోగ వ్యాపారాల్లో భారీ లాభాలు

Published : May 25, 2026, 05:01 PM IST

Mercury Transit:: బుధుడిని తెలివితేటలు, వ్యాపారం, వాక్కు, కెరీర్‌కు కారకుడిగా భావిస్తారు. బుధుడు రాశి మారినప్పుడల్లా దాని ప్రభావం రాశి చక్రంలో ఉన్న  12 రాశులపై కనిపిస్తుంది. మే నెల చివరి రోజుల్లో బుధుడు మిథునంలోకి ప్రవేశిస్తాడు. 

PREV
14
మిథున రాశి

బుధుడు మిథున రాశికి అధిపతి. ఈ రాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల వీరికి ఎంతో శుభప్రదమైన రోజులు మొదలవుతున్నాయి. చేస్తున్న ఉద్యోగంలో లేదా వ్యాపారంలో కొత్త విజయాలు దక్కుతాయి. గతంలో మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.  వీరు ఆర్ధికంగా బలపడతారు. కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.

24
సింహ రాశి

సింహ రాశికి అధిపతి సూర్యుడు. బుధుడు మిథునంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి మేలు జరుగుతుంది. ఉద్యోగంలో శుభవార్తలు అందుతాయి. ఆఫీసులో ఈ రాశి వారి పనికి గుర్తింపు లభిస్తుంది.  పనికి ప్రశంసలు లభిస్తాయి. ఇక వ్యాపారం చేసే వారికి  లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది.

34
తులా రాశి

తులా రాశి వారికి బుధుడి సంచారం ఎంతో శుభప్రదంగానూ. లాభదాయకంగానూ ఉంటుంది. వీరికి ధన లాభ యోగాలు ఉన్నాయి. ఇతరుల చేతిలో ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే చేతికందే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు వస్తాయి. ఈ సమయంలో మీ మాటతీరు, నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడతాయి. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనాలు కలగవచ్చు. 

44
మకర రాశి

బుధుడు మిథునంలోకి ప్రవేశించడం వల్ల ఆ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభించవచ్చు. అలాగే వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కుటుంబంతో సంబంధాలు మెరుగుపడతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ సమయంలో వేసిన కొత్త ప్రణాళికలు లాభాలను తెచ్చిపెడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories