Birth Date: న్యూమరాలజీ ప్రకారం ఒక అమ్మాయి పుట్టిన తేదీని ఆమె స్వభావం ఆధారపడి ఉంటుంది. కొందరు అమ్మాయిలు తమ అద్భుతమైన తెలివితేటలతో, ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో తమ భర్తను గుప్పిట్లో పెట్టుకుంటారు. తాము చెప్పిందే వేదం అన్నట్టుగా మార్చేసుకుంటారు.
ఒకమ్మాయి పుట్టిన తేదీని బట్టి వారి వ్యక్తిత్వం, లక్షణాలు, గుణాలు ఆధారపడి ఉంటాయి. ఆ తేదీలు వ్యక్తిత్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. సంఖ్యాశాస్త్రం చెబుతున్న ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు తమ భర్తను చేతుల్లో పెట్టుకునే టాలెంట్ ఉంటుంది. ఏ తేదీల్లో పుట్టిన వారికి ఈ టాలెంట్ ఉంటుందో తెలుసుకోండి.
24
మూల సంఖ్య 1
సంఖ్యాశాస్త్రం చెబుతున్న ప్రకారం, మూల సంఖ్య 1 ఉన్న అమ్మాయిలకు అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అంటే ఏ నెలలోనైనా 1,10,19,28 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 1 అవుతుంది. ఈ అమ్మాయిలు స్వతహాగా చాలా స్ట్రాంగ్ మైండ్ కలిగి ఉంటారు. స్వతంత్రంగా బతకడానికి వీరు ఇష్టపడతారు. వీరు చాలా ప్రభావవంతంగా ఉంటారు. వీరి మాటలకు, చేతలకు వీరి భర్త పడిపోతారు. వీళ్లపై చాలా ప్రేమను చూపిస్తారు. భర్త ప్రతిదీ తమకు చెప్పే పనులు చేసేలా కట్టుబడిలో ఉంచుతారు.
34
మూల సంఖ్య 3
ప్రతినెలలో 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన అమ్మాయి మూల సంఖ్య 3 అవుతుంది. ఈ అమ్మాయిలు తమ మాటలతో ఎవరి మనసునైనా గెలుచుకుంటారు. వీళ్లు చాలా స్నేహపూర్వకంగా, చురుకుగా వ్యవహరిస్తారు. అందుకే వీరు భాగస్వామిపై తమదైన ముద్ర వేస్తారు. వీళ్లు తమ మాటలను ఒప్పించడంలో చాలా నేర్పరులు. వీరు చెప్పే ప్రతిమాటకు భర్త తెలియకుండానే తలూపేస్తారు.
ప్రతి నెలలో 9, 18, 27 తేదీలలో పుట్టిన అమ్మాయిల సంఖ్య 9 అవుతుంది. ఈ అంకెకు అధిపతి అంగారకుడు. అందుకే ఈ అమ్మాయిలను నిర్భయంగా, ధైర్యంగా ఉండేలా చేస్తుంది. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ఉత్సాహంగా ఉంటారు. భాగస్వామిపై చాలా ప్రభావాన్ని చూపిస్తారు. వీళ్లు పైకి సున్నితంగా కనిపించినా, నిర్ణయాల్లో చాలా దృఢంగా ఉంటారు. వీరు భర్తపై చాలా కేరింగ్ చూపిస్తారు. తమ కొంగునే కట్టేసుకుంటారు.