వృత్తిపరంగా మెరుగైన ఫలితాల కోసం అదనంగా శ్రమించాల్సి ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదా తొందరపడి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మాట పరుషంగా లేకుండా చూసుకుంటే సంబంధాలలో అపార్థాలు రావు. మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
వృశ్చిక రాశి:
ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సాధారణం కంటే ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. అనవసర వివాదాలకు, గొడవలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఎదురైనా, కోపానికి గురికాకుండా ప్రశాంతంగా, ఓపికతో వ్యవహరిస్తే సమస్యల నుంచి బయటపడవచ్చు.