బుధుని వల్ల సెప్టెంబర్ 18 వరకు 4 రాశుల వారికి కలహాలు, ఆర్ధిక కష్టాలు

Published : Aug 20, 2026, 10:07 AM IST

సూర్యుడు ఆగస్టు 17న సింహరాశిలోకి ప్రవేశించాడు. ఆగస్టు 22న బుధుడు కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల బుధుడు ఆగస్టు 18 నుండి సెప్టెంబర్ 18 వరకు అస్తమయ స్థితిలో ఉంటాడు.దీనివల్ల 4 రాశుల వారికి కష్టాలు వచ్చే అవకాశం ఉంది.

PREV
14
మేషం

మేషరాశి వారికి బుధ గ్రహ సంచారం ప్రతికూల ఫలితాలను అందించే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు మాట్లాడేటప్పుడు సమస్యల బారిన పడవచ్చు. ఈ రాశివారు పనిచేసే చోట అపార్థాలకు, వివాదాలకు దారితీయవచ్చు. వృత్తిపరంగా కూడా ఒత్తిడి ఉంటుంది. ఇది మేష రాశి వారి వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడుతుంది. వ్యాపారపరంగా నష్టాలు రావచ్చు.

24
కన్యా రాశి

కన్యారాశికి అధిపతి బుధుడు. బుధుడు ఇప్పుడు అస్తమించే దశలో ఉండడం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది. తొందరపాటు లావాదేవీలకు దూరంగా ఉంటే మంచిది. మీరు ఏవైనా ఒప్పందాలు చేసుకుంటే జాగ్రత్తగా ఉండండి. మోసాలు జరిగే అవకాశం ఉంది. పెద్ద పొరపాట్లు జరగవచ్చు.

34
సింహ రాశి

బుధుడు సింహరాశిలో ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల ఈ రాశి వారి ఆరోగ్యం, వృత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. రహస్య శత్రువులు ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. వృత్తి విషయంలో అజాగ్రత్తగా ఉంటే తీవ్ర నష్టం జరగవచ్చు. పనిచేసే చోట ఎవరితోనైనా వాదించే అవకాశం వచ్చినా ఆ క్షణానికి దూరంగా వెళ్లండి.

44
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి బుధుడి అస్తమయం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా రక్తపోటు ఉన్నవారు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయాలను వాయిదా వేయండి. మాట్లాడే ముందు ఆలోచించి ఆ తర్వాతే మాట్లాడండి. డబ్బు అప్పు చేయాలసి రావచ్చు. ఇంట్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతాయి. వ్యాపార ఒప్పందాలు విఫలమవుతాయి. పనిలో అడ్డంకులు రావచ్చు

Read more Photos on
click me!

Recommended Stories