Rahu Transit: దిశను మార్చుకుంటున్న రాహు...ఈ 3 రాశుల అదృష్టం రెట్టింపు

Published : Dec 27, 2025, 03:42 PM IST

Rahu Transit: 2026లో రాహు గ్రహం తన దిశను మార్చుకుంటున్నాడు. కుంభ రాశిని వదిలేసి, మకర రాశిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ రాహు సంచారం కొన్ని రాశుల తలరాత పూర్తిగా మార్చేయనుంది. 

PREV
14
Rahu Transit

జోతిష్యశాస్త్రం ప్రకారం, రాహువును మోసపూరిత గ్రహంగా పరిగణిస్తారు. ఈ రాహువు తన స్థానం మార్చుకున్న ప్రతిసారీ.. ఆ ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. ప్రస్తుతం రాహువు కుంభ రాశిలో ఉన్నాడు. త్వరలో మకర రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. దీని కారణంగా మూడు రాశుల అదృష్టం రెట్టింపు కానుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం....

24
వృషభ రాశి...

రాహు సంచారం వృషభ రాశివారికి చాలా ప్రయోజనాలు కలిగించనుంది. దీని ఫలితంగా.. ఈ రాశివారి ఆదాయంలో చాలా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్ ద్వారా ఎక్కువ ఆదాయం పెంచుకునే అవకాశం ఉంది. వ్యాపారాల నుంచి కూడా ఎక్కువ లాభాలు పెంచుకోవచ్చు. విదేశాలలో వ్యాపారం చేసే వారికి లాభాలు రెట్టింపు అవుతాయి. ఏ పని చేసినా విజయం సాధించగలరు. అదృష్టం రెట్టింపు అవుతుంది. ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. అందుకే, తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి.

34
కన్య రాశి...

రాహు సంచారం కన్య రాశి వారికి చాలా మేలు చేయనుంది. అన్ని రంగాల్లో ప్రయోజనాలు పొందుతారు. మీ తెలివితేటలు పెరుగుతాయి. ఫలితంగా ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాలు కనుగొంటారు. స్టాక్ మార్కెట్ల నుంచి భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ సమయం విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో సమస్యలు ఉండవు. ఉద్యోగ, వ్యాపారాల నుంచి ఆదాయం పెంచుకుంటారు.

44
మీన రాశి...

మకర రాశిలోకి రాహువు ప్రవేశం ఈ రాశి వారికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. రాహువు ఈ రాశి 11వ ఇంట్లోకి (లాభ స్థానం) ప్రవేశిస్తాడు. ఇది ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలను తెరుస్తుంది. దీనితో, ఊహించని ఆర్థిక లాభాలు సాధించడం సాధ్యమౌతాయి. మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమవుతాయి . సమాజంలోని ప్రభావవంతమైన వ్యక్తుల నుండి మీకు సపోర్ట్ లభిస్తుంది. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. మీరు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపుతారు.

Read more Photos on
click me!

Recommended Stories