బల్లి శాస్త్రం ప్రకారం... మన శరీరంపై బల్లి పడితే అది పడిన ప్రదేశాన్ని బట్టి భవిష్యత్తు ఫలితాలుంటాయి. తల, చేయి, కాలు వంటి భాగాలపై పడటం వల్ల కలిగే మంచి చెడులు, వాటికి సులభమైన పరిహారాలను ఈ కథనం వివరిస్తుంది.
మన పూర్వీకులు చెప్పిన శాస్త్రాల్లో 'బల్లి శాస్త్రం' చాలా ముఖ్యమైంది. ఇంట్లో తిరిగే బల్లులు మన శరీరంపై పడటాన్ని యాదృచ్ఛికంగా కాకుండా, భవిష్యత్తుకు సంకేతంగా నమ్ముతారు. బల్లి ఎక్కడ పడిందనే దాన్ని బట్టి మంచి ఫలితాలు, హెచ్చరికలు ఉంటాయి. అవేంటో వివరంగా చూద్దాం....
26
తలపై బల్లి పడితే..
తల మీద బల్లి పడితే అది ఒక హెచ్చరికగా భావిస్తారు. అనవసర ఆందోళనలు, ఇతరుల నుంచి వ్యతిరేకత లేదా బంధువుల నుంచి చెడు వార్తలు వినాల్సి రావచ్చు. బల్లి తల మీద కాకుండా జుట్టుపై పడితే, అది మీకు ఏదో ఒక విధంగా మేలు చేస్తుంది. ఇలా మనం నిల్చున్నప్పుడు, లేదా కూర్చున్నప్పుడు బల్లి పడే అవకాశాలుంటాయి.
36
నుదిటిపై బల్లి పడితే..
నుదుటిపై బల్లి పడటం చాలా శ్రేష్ఠం. ఎడమ నుదుటిపై పడితే కీర్తి, కుడి నుదుటిపై పడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ముఖంపై పడితే బంధువుల రాకను సూచిస్తుంది. కనుబొమ్మపై పడితే ఉన్నతాధికారుల సహాయం లభిస్తుంది. కళ్ళు, బుగ్గలపై పడితే చిన్న శిక్ష లేదా సమస్యలు రావచ్చు. ఇలా మనం పడుకున్నప్పుడు బల్లి పడే అవకాశాలుంటాయి.
ఎడమవైపు చేతులు, కాళ్లపై బల్లి పడితే ఆ రోజంతా సంతోషకరమైన వార్తలు వస్తాయి. కుడివైపు పడటం అనారోగ్యాన్ని లేదా ఆరోగ్య సమస్యలను సూచిస్తుందని నమ్ముతారు. పాదంపై పడితే భవిష్యత్తులో మీరు విదేశీ పర్యటన చేసే అవకాశాలు ఉంటాయి.
56
ఛాతిపై బల్లి పడితే...
కుడి ఛాతీపై పడితే లాభం, ఎడమ ఛాతీపై పడితే సుఖం కలుగుతుంది. బొడ్డుపై పడితే విలువైన ఆభరణాలు కొనే యోగం కలుగుతుంది. ఎడమ మెడపై పడితే కార్య విజయం, కుడి మెడపై పడితే ఇతరులతో విభేదాలు రావచ్చు. తొడపై పడితే తల్లిదండ్రులకు బాధ కలిగించే పనులు జరగవచ్చు. ఇలా శరీరంపై బల్లి పడే స్థానాన్ని బట్టి మన ఫేట్ మారుతుందట.
66
శరీరంపై బల్లి పడితే పరిహారం..
బల్లి పడితే ఆందోళన వద్దు. సులభ పరిహారాలున్నాయి. వెంటనే తలస్నానం చేయాలి. తర్వాత ఇష్టదైవాన్ని పూజించి, చెడు జరగకూడదని ప్రార్థించాలి. కాంచీపురం ఆలయంలోని బంగారం, వెండి బల్లులను తాకడం ఉత్తమ పరిహారం. ఇది దోషాలను తొలగిస్తుంది. ఈ పరిహారాలు నమ్మకాలపై ఆధారపడినవి.
గమనిక : బల్లి శాస్త్రానికి సంబంధించిన వివరాలను ఇంటర్ నెట్ లో లభించిన సమాచారం ఆదాారంగా అందిస్తున్నాం. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే జ్యోతిష్యులు, పండితులను సంప్రదించండి.