Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారికి 2026లో గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ!

Published : Dec 27, 2025, 12:02 PM IST

ఏటా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటారు. కొందరికి చిన్న ప్రయత్నంతోనే అవకాశం దక్కితే, మరికొందరికి ఏళ్ల పాటు ఎదురుచూపులు తప్పవు. అయితే కొన్ని తేదీల్లో పుట్టినవారికి 2026లో గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ బలంగా ఉందట. ఆ తేదీలేంటో చూద్దాం.

PREV
15
Birth Date Prediction for Government Job

జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ, గ్రహస్థితులు.. మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం, స్థిరత్వం, ప్రభుత్వ రంగంలో అవకాశాలు వంటి అంశాలపై శని, గురు, సూర్య గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2026 కీలక గ్రహ మార్పులతో కూడిన సంవత్సరం. ఈ ఏడాదిలో శని తన స్థిర ప్రభావాన్ని చూపడం, గురు అనుకూల స్థానాల్లో సంచరించడం వల్ల కొన్ని తేదీల్లో పుట్టిన వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

25
1, 4, 10, 13, 19, 22, 28 తేదీల్లో పుట్టినవారు

ఏ నెలలో అయినా 1, 4, 10, 13, 19, 22, 28 తేదీల్లో పుట్టినవారు 2026లో కీలక అవకాశాలను అందిపుచ్చుకునే సూచనలు ఉన్నాయని జ్యోతిష్య విశ్లేషణ చెబుతోంది. ఈ తేదీలు సూర్యుడు, రాహు, గురు ప్రభావంతో సంబంధం కలిగి ఉంటాయి. ముఖ్యంగా 1, 10 తేదీల్లో పుట్టినవారు.. సూర్యుడి బలమైన ప్రభావం వల్ల రాత పరీక్షలు, ఇంటర్వ్యూలలో అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది.

35
4, 22 తేదీల్లో పుట్టినవారు

ఏ నెలలో అయినా 4, 22 తేదీల్లో పుట్టినవారు రాహు ప్రభావంతో భిన్నంగా ఆలోచించే సామర్థ్యం కలిగి ఉంటారు. పోటీ పరీక్షలకు వీరు ఇతరుల కంటే భిన్నంగా ప్రిపేర్ అవుతారు. 2026లో రాహు అనుకూల స్థానంలో ఉండటం వల్ల టెక్నికల్, గ్రూప్ ఎగ్జామ్స్, డిఫెన్స్ లేదా పరిపాలనా రంగాల్లో వీరికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని జ్యోతిష్య విశ్లేషణ చెబుతోంది.

45
శని, సూర్యుడి ప్రభావంతో..

13, 19 తేదీల్లో పుట్టినవారు శని, సూర్యుడి మిశ్రమ ప్రభావంతో కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం కృషి చేస్తున్నవారికి 2026లో శని అనుకూల దశ ప్రారంభమై, నియామక ప్రక్రియలు పూర్తయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి. 

55
గురు ప్రభావంతో..

ఏ నెలలో అయినా 28 వ తేదీన పుట్టినవారు గురు ప్రభావంతో జ్ఞానం, ధైర్యం, నిర్ణయ సామర్థ్యం కలిగి ఉంటారు. గురు 2026లో అనుకూల రాశుల్లో సంచరించడం వల్ల వీరికి అదృష్టం కలిసివస్తుంది. ముఖ్యంగా విద్యా అర్హతల ఆధారంగా వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు, టీచింగ్, బ్యాంకింగ్, పరిపాలనా సేవల్లో వీరికి అవకాశాలు పెరిగే సూచనలు ఉన్నాయని జ్యోతిష్య విశ్లేషణ పేర్కొంది.

Read more Photos on
click me!

Recommended Stories