దిండు కింద ఇవి పెట్టుకుంటే.. మీ సంపద పెరుగుతుంది

First Published | Sep 13, 2024, 10:09 AM IST

మీరు దిండు కింద కొన్ని వస్తువులు పెట్టుకుంటే చాలు...మీ సంపద పెరుగుతుంది. మరి అవేంటో ఓసారి చూద్దాం..


సంపాదన పెంచుకోవాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. దాని కోసం మనం రాత్రి పగళ్లు.. తెగ కష్టపడుతూ ఉంటాం. అయితే...చాలా మంది.. తాము ఎంత కష్టపడినా డబ్బులు మాత్రం నిలవడం లేదు అని వాపోతూ ఉంటారు. అలాంటివారు. కొన్ని సింపుల్ రెమిడీ ఫాలో అవ్వడం వల్ల మీ సంపద నిలుపుకోవచ్చని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం.  మీరు దిండు కింద కొన్ని వస్తువులు పెట్టుకుంటే చాలు...మీ సంపద పెరుగుతుంది. మరి అవేంటో ఓసారి చూద్దాం..

tulsi

1.తులసి ఆకులు..
తులసి ఆకులను రాత్రి పడుకునేముందు దిండు కింద పెట్టుకుంటే ఒక దైవికత్వం మీ వెంట ఉన్న అనుభూతి కలుగుతుంది. మీ ఇంట్లో ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే... అది మొత్తం తొలగిపోతుంది. దీని వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది. హ్యపీగా నిద్రపడుతుంది. ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది. కాబట్టి రోజూ పడుకునే ముందు రెండు తులసి ఆకులు దిండు కింద ఉంచుకుంటే సరిపోతుంది.
 


2.లవంగాలు..
మీరు రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలు దిండు కింద పెట్టుకొని నిద్రపోతే సరిపోతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడంతో పాటు.. ఇంట్లో సంపద పెరగడానికి కూడా సహాయపడుతుంది. ఎక్కడైనా మీ డబ్బులు ఆగిపోతే.. అవి కూడా తిరిగి మీ చెంతకు చేరతాయి. ఈ ట్రిక్ నిజంగా.. మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.
 

3.చిన్న అద్దం..
మనం పాకెట్ లో క్యారీ చేయగల చిన్న అద్దాలు ఉంటాయి కదా.. వాటిని కూడా మీరు మీ దిండు కింద పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల.. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ అద్దం తీసేసుకుంటుంది. దీని వల్ల.. మీకు ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది. అంతేకాదు..మీ సంపద పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

4.పసుపు..
ఒక చిన్న పసుపు ప్యాకెట్ ని మనం.. దిండు కింద పెట్టుకొని నిద్రపోతే సరిపోతుంది. దీని వల్ల.. మనకు జీవితంలో సంపద, ప్రశాంతత లభిస్తుంది. జీవితంలో ఎక్కడా దొరకని ప్రశాంతత మీకు ఈ చిన్న పసుపు ప్యాకెట్ తీసుకువస్తుందంటే మీరు నమ్ముతారా? ఒక్కసారి పెట్టి చూడండి. జీవితం లోని చాలా బాధల నుంచి విముక్తి లభిస్తుంది.
 

5.గంధం..
మంచి స్వచ్ఛమైన గంధం కూడా మన జీవితాన్ని మార్చేస్తుంది. గంధం ముక్కను దిండు కింద పెట్టుకొని నిద్రపోవడం వల్ల... మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీకు రావాల్సిన డబ్బులు ఎక్కడైనా ఆగిపోయినా.. అవి మీ ఇంటికి చేరుతాయి. అంతేకాదు.. మీకు ఏవైనా అప్పులు ఉన్నా.. అవి వెంటనే తీరే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

6.నెమలి ఈకలు..
మీరు నమ్మకపోవచ్చు. కానీ.. నెమలి ఈకలు రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకొని పడుకుంటే.. కచ్చితంగా మీ అదృష్టం పెరుగుతుంది. మీ సంపదన పెరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. చెడు కలలు రాకుండా ఉంటాయి.
 

7.కర్పూరం..
కర్పూరాన్ని స్వచ్ఛతకు మారుపేరుగా చెబుతూ ఉంటారు. ఇలాంటి కర్పూరాన్ని చిన్న ముక్కను మీరు మీ దిండు కింద పెట్టుకొని పడుకున్నా చాలు.. మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఆ స్వచ్ఛమైన కమ్మని వాసనకు.. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. మీ ఇంట్లో సంపద పెరుగుతుంది. అప్పులు తీరతాయి. మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చినా.. తిరిగి డబ్బులు మీకు అందుతాయి.
 

8.ఉప్పు..
ఉప్పును కేవలం రుచికి మాత్రమే వాడతారు. కానీ... ఉప్పు కూడా మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటే మీరు నమ్ముతారా? అవును.. గళ్ల ఉప్పును.. మీరు చిన్న ప్యాకెట్ లో లేదా. చిన్న మూటలా చేసి.. దిండు కింద పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల... మీ జీవితంలో చాలా మార్పు చూస్తారు. మీకు తెలియని ఓ ప్రశాంతత లభిస్తుంది. రావాల్సిన డబ్బు వచ్చి   చేరుతుంది. నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గుతుంది.
 

9.కాయిన్స్..
డబ్బును ఆకర్షించడానికి మనం డబ్బును కూడా వాడొచ్చు.మీరు తల కింద ఒక రెండు, మూడు కాయిన్స్ ని పెట్టుకొని నిద్రపోతే సరిపోతుంది. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల.. ఇంట్లో సంపద కచ్చితంగా పెరుగుతుంది. కావాలంటే 21 రోజులు ప్రయత్నించి చూడండి. వీటిలో ఏది చేసినా కనీసం వరసగా 21 రోజులు అయినా చేయాలి అనే విషయం గుర్తుంచుకోండి.

Latest Videos

click me!