ఇంట్లో డబ్బులు లేకపోతే ఏం చేయాలో తెలుసా?

First Published | Sep 10, 2024, 2:53 PM IST

ఎంత డబ్బు సంపాదించినా.. కొన్ని కొన్ని సార్లు చేతిలో రూపాయి కూడా ఉండదు. కానీ ఇలాంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో అప్పులు కూడా పుట్టవు. అసలు మీరు ఇంట్లో డబ్బు లేకపోతే ఏం చేయాలో తెలుసా?

ప్రతి ఒక్కరికీ మెరుగైన జీవితాన్ని గడపాలని ఉంటుంది. అలాగే తరతరాలకు సరిపడా డబ్బును సంపాదించాలనుకుంటారు. ఎందుకంటే డబ్బు ఉంటేనే జీవితం గడపడం సాధ్యమవుతుంది. డబ్బు లేకుంటే బతకడం కూడా కష్టమే.

డబ్బుంటుంటేనే  కడుపు నిండా తినగలుతాం. మంచి దుస్తులు వేసుకోగలుగుతాం. పిల్లల చదువలు, వారి పెళ్లి, ఇంటిళ్లి పాది ఆరోగ్యం, ఇల్లు గడవడానికి, సమాజంలో గౌరవంగా బతకడానికి ఇలా.. ప్రతిదానికీ డబ్బు చాలా చాలా అవసరం.

డబ్బంటూ లేకపోతే ఇవేవీ ఉండవు. అందుకే ప్రతి ఒక్కరూ జీవితంలో డబ్బు బాగా సంపాదించేందుకు ఎంతో కష్టపడుతుంటారు.  మంచి జీవితం మరియు చాలా డబ్బు ఉండాలని కోరుకుంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మన చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు.

కొన్ని సార్లైతే అవసరానికి అప్పు కూడా పుట్టదు. జ్యోతిష్యుల ప్రకారం.. ఇంట్లో డబ్బు నిలవకపోవడానికి వాస్తు లోపం కూడా ఒక కారణం. ఇలాంటి పరిస్థితిలో మీరు కొన్ని పనులు చేస్తే ఇంట్లో డబ్బు కొరత ఉండదు. చేతిలో డబ్బు పుష్కలంగా ఉంటుంది. 
 


తులసి ఆరాధన

తులసి మొక్కను హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు. అందుకే ఆడవాళ్లు ప్రతిరోజూ తులసి మొక్కు పూజ చేస్తారు. దీపం వెళిగిస్తారు. అయితే  మీ ఇంట్లో డబ్బు నిలవకపోతే ప్రతిరోజూ తులసి మాతను పూజించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ధనానికి కొదవ ఉండదు.

ఉత్తర దిశను శుభ్రంగా ఉంచుకోవాలి

వాస్తు ప్రకారం.. ఉత్తర దిక్కు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే ఈ దిశ సంపదతో ముడిపడి ఉంటుందని నమ్ముతారు. అందుకే ఈ దిశను ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో ఈ దిశ మురికిగా, చెత్తగా ఉంటే మీ ఇంట్లో డబ్బు ఉండదు. మీరు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. 

ఎక్కువ సేపు నిద్రపోకూడదు

పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు.. పొద్దు పోయేదాక ఇంట్లో నిద్రపోకూడదని. ఇలా ఎందుకు చెప్తున్నారో ఎవ్వరికీ అర్థం కాదు. కానీ ఇది కూడా మీ ఇంట్లో ప్రతికూలతకు దారితీస్తుంది. అవును శాస్త్రాల ప్రకారం.. ఉదయాన్నే నిద్రలేవాలి. ఎందుకంటే ఎక్కువ సేపు నిద్రపోయే వారికి లక్ష్మీ అనుగ్రహం ఉండదు. దీనివల్ల వీరి చేతిలో రూపాయి కూడా ఉండదు. కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి లక్ష్మీదేవిని పూజించాలి.

డబ్బును సరైన దిశలో ఉంచాలి

చాలా మంది ఇంట్లో డబ్బును ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. పోపు డబ్బాలో, మంచం కింద ఇలా చాలా ప్లేసెస్ లో డబ్బును పెట్టే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఇలా అస్సలు పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. డబ్బును ఎప్పుడూ కూడా ఉత్తర దిశలోనే ఉంచాలి.

శంఖాన్ని గడియారం వైపు ఉంచండి

శంఖాన్ని ఎప్పుడూ కూడా మీ ఇంట్లో దక్షిణం వైపునే ఉంచండి. దీనివల్ల డబ్బుకు సంబంధిత సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీరుపూజ చేసేటప్పుడు ఖచ్చింతంగా శంఖాన్ని ఊదండి. దీనిని ఎంతో శుభప్రదంగా భావిస్తారు. శంఖంలో లక్ష్మీ నివసిస్తుందని చెబుతారు.

లక్ష్మీదేవితో కుబేరుడిని విగ్రహం

మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి విగ్రహంతో పాటుగా కుబేరిడి విగ్రహం కూడా ఉండేలా చూసుకోండి. ఈ విగ్రహం వల్ల మీ ఇంట్లో డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. 

ప్రధాన ద్వారం వద్ద దీపం 

లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలనుకుంటే మీరు ప్రతిరోజూ మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపాన్ని వెలిగించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ చేరుతుంది. అలాగే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది.
 

Latest Videos

click me!