జోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు నవగ్రహాల్లో ఒకడు. ఈ సూర్య గ్రహం ప్రతి 30 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం తన సొంత రాశి అయిన సింహ రాశిలో ఉన్నాడు. ఈ నెల అంటే సెప్టెంబర్ 16వ తేదీన కన్య రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. అయితే.. సూర్య గ్రహంలో ఈ మార్పులు... ఇతర రాశులపై చాలా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా నాలుగు రాశులపై చాలా చెడు ప్రభావం చూపించనుందట. మరి, ఆ రాశులేంటో చూద్దాం....
మేష రాశికి ఇబ్బందులు..
సూర్య గ్రహం రాశి మార్చుకోవడం వల్ల ఆ ప్రభావం మేష రాశిపై చాలా గట్టిగానే ఉండేలా ఉంది. ఈ రాశివారు చాలా సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. వారి జీవితంలో నిరాశ చాలా ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో ధన నష్టం కూడా ఉంటుంది. ప్రేమ జీవితానికి సంబంధించిన విషయాలు బయటపడటం అవమానానికి దారితీస్తుంది. ఉద్యోగంలో ఇష్టం లేకున్నా కొన్ని పనులు చేయాల్సి రావచ్చు.
కర్కాటక రాశివారికి చెడు వార్తలు...
సూర్యుని రాశి మార్పు కారణంగా కర్కాటక రాశి వారికి కొన్ని చెడు వార్తలు అందవచ్చు. కుటుంబంలో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరిగే అవకాశం ఉంది. పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచండి, లేకుంటే తర్వాత పశ్చాత్తాపపడవలసి వస్తుంది. బ్యాంకు బ్యాలెన్స్‌లో ఆకస్మిత తగ్గింపు ఉండవచ్చు. ప్రత్యేక స్నేహితుడితో వివాదం రావచ్చు.
తుల రాశివారికి ధన నష్టం..
సూర్య గ్రహం రాశి మార్పు కారణంగా తుల రాశి వారు ధన నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. పెట్టుబడుల ద్వారా నష్టాలు వస్తాయి. ఇచ్చిన అప్పులు ఎక్కువ కాలం పాటు రాకపోవచ్చు. ఏదైనా రహస్య విషయం బయటపడటం వల్ల అవమానం ఎదుర్కోవాల్సి రావచ్చు. వ్యాపారంలో తీసుకున్న నిర్ణయాలు తప్పు అని తేలుతాయి. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించండి.
కుంభ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం..
సూర్యుని రాశి మార్పు కారణంగా కుంభ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వీరిని అవకాశం కోసం ఉపయోగించుకోవచ్చు. శత్రువులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. వాహనం కూడా జాగ్రత్తగా నడపాలి, లేకుంటే ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. ప్రేమ జీవితంలో సమస్యలు రావచ్చు. ధన నష్టం జరిగే అవకాశం ఉంది.
Disclaimer
ఈ వ్యాసంలో ఇవ్వబడిన సమాచారం అంతా జ్యోతిష్యులు, పంచాంగం, మరియు నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఈ సమాచారాన్ని మీకు అందించడంలో మేము కేవలం ఒక మాధ్యమం మాత్రమే. వినియోగదారులు ఈ సమాచారాన్ని కేవలం సమాచారం కోసం మాత్రమే ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాము.