Vastu tips: వాస్తు ప్రకారం ఈ మొక్కలు ఇంటి ఆవరణలో పెంచకూడదు..!

Published : Jun 13, 2022, 04:48 PM IST

అన్ని మొక్కలు మనం అనుకున్నట్లుగా పాజిటివిటీని పెంచవట. కొన్ని మొక్కలు నెగిటివిటీని కూడా తెస్తాయట. వాస్తు ప్రకారం వాటిని ఇంట్లో పెంచకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

PREV
17
Vastu tips: వాస్తు ప్రకారం ఈ మొక్కలు ఇంటి ఆవరణలో పెంచకూడదు..!
Astrology remedies 2022

ఇంట్లో పచ్చని మొక్కలు ఉంటే ఆ అందమే వేరు. అందం మాత్రమే కాదు.. ఇంట్లో ఓ ప్రశాంతత లభిస్తుంది. మనకు తెలియకుండానే ఓ పాజిటివిటీని ఆ మొక్కలు పంచుతాయి. అందుకే.. పూర్వం ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు పెంచేవారు. ఇప్పుడు అంత అవకాశం లేకపోవడంతో.. అపార్ట్మెంట్ లో అయినా.. ఇండోర్ ప్లాంట్లు పెంచుకుంటున్నారు. అయితే... అన్ని మొక్కలు మనం అనుకున్నట్లుగా పాజిటివిటీని పెంచవట. కొన్ని మొక్కలు నెగిటివిటీని కూడా తెస్తాయట. వాస్తు ప్రకారం వాటిని ఇంట్లో పెంచకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ మొక్కలేంటో.. వాస్తు ఏం చెబుతుందో ఓసారి చూద్దాం...
 

27

1.క్యాక్టస్..

వీటినే ఎడారి మొక్కలు అని కూడా అంటారు. వీటిని పెంచడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. చూడటానికి కూడా అందంగా ఉంటాయి కదా అని ఈ మధ్య అందరూ వీటిని ఇంట్లో పెంచుతున్నారు. కానీ వాస్తు ప్రకారం వీటిని పెంచకపోవడమే మంచిదట. వాటికి ఉండే ముళ్లు నెగిటివ్ ఎనర్జీని వ్యాపింప చేస్తాయట. మన ఇంట్లోని ఎనర్జీని కూడా తగ్గిపోయేలా చేయగలవట. అందుకే.. ఈ మొక్కలను ఇంట్లో పెంచకపోవడమే ఉత్తమం.

37
bonsai

 

2.బోన్ సాయి..

చాలా మంది పెద్ద పెద్ద చెట్లు పెంచలేక.. ఆ స్థానంలో వాటిని బోన్ సాయి మొక్కలుగా మార్చి ఇంట్లో పెంచుతున్నారు. కానీ.. నిజానికి వాస్తు ప్రకారం ఈ మొక్కలు కూడా ఇంట్లో పెంచడం మంచిది కాదట. ఇవి మీ ఎదుగుదలను ఆపేస్తాయట. ప్రకృతి విరుద్దంగా వాటిని పెంచడం కూడా నెగిటివ్ ఎనర్జీ కి కారణమౌతాయట.
 

47

లక్కీ బాంబూ (Lucky bamboo): లక్కీ బాంబూ చెట్టు ఏ ఇంటిలో అయితే ఉంటుందో ఆ ఇంటిలో ఉన్న వారికి అదృష్టం (Good luck) వరిస్తుంది. ఈ మొక్కలు భారీ వెదురు చెట్టు జాతికి సంబంధించినవే. కాకపోతే ఇవి చిన్న వెదురు చెట్లు. ఈ చెట్లను మనము ఆఫీసులో ఇంటిలో టేబుల్ పైన ఉంచిన ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ చెట్టు ఉన్న ఇంటికి అదృష్టం పట్టుకుందని చాలామంది నమ్ముతారు. అయితే.. ఈ బాంబో ప్లాంట్ ని వాస్తు ప్రకారం.. ఇంటి మొదట్లో పెడితే మనకు అదృష్టం కలిసొస్తుందట. కానీ.. పొరపాటున కూడా వీటిని ఇంటి వెనక పెట్టకూడదట. అలా పెట్టడం వల్ల... మనకు దక్కాల్సిన సపోర్ట్... వ్యక్తిగత జీవితంలో దక్కకుండా పోతుందట.
 

57

ఇక వీటి సంగతి పక్కన పెడితే.. ఏ మొక్క అయినా బెడ్రూమ్ లో మాత్రం అస్సలు పెట్టకూడదట. దాని ఫలితం మన బెడ్రూమ్ పై బాగా పడుతుందట. 

67

దాని వల్ల.. రాత్రిపూట సరిగా నిద్ర పట్టక.. నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటారట. ఉదయం లేచే సరికి చాలా చిరాకుగా ఉంటుందట.

77

ఇక ఏదైనా మొక్క ఎండిపోతున్నా.. లేదంటే చనిపోతున్నా.. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తోందని అర్థమట. అలాంటివి జరుగినప్పుడు వెంటనే... ఆ మొక్కల స్థానంలో మరో కొత్త మొక్కను చేర్చాలి. అంతేకానీ.. ఎండిపోయిన మొక్కని ఇంట్లో ఉంచకూడదు.
 

Read more Photos on
click me!

Recommended Stories