
మనమంతా మనుషులమే అయినా.. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. ఒక్కొక్కరి ఆలోచనా విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అదేవిధంగా వివిధ రాశులవారు వివిధ రకాలుగా ఉంటారు. అయితే.. జోతిష్యశాస్త్రం ప్రకారం అన్ని రాశులవారందరూ కలిసి వెకేషన్ కి వెళ్తే... ఒక్కొక్కరు ఎలా ప్రవర్తిస్తారో ఓసారి చూద్దాం..
1. మేష రాశి..
ఈ రాశివారికి ఖాళీగా ఇంట్లో కూర్చోవడం నచ్చదు. ముఖ్యంగా వెకేషన్ కి వెళ్లినప్పుడు ఎక్కడికీ వెళ్లకుండా ఏమీ చేయకుండా వీరు ఉండలేరు. ఏదైనా అడ్వెంచర్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు.
2.వృషభ రాశి..
ఈ రాశివారు వెకేషన్ అనగానే.. ముందుగానే ప్లాన్స్ వేసుకుంటారు. అయితే.. తీరా వెళ్లిన తర్వాత అక్కడ తమ ప్లానింగ్ తగ్గట్టు జరగకపోతే వీరికి బాగా విసుగు వస్తుంది. ఆ కోపంలో వారు ఏది పడితే అది చేస్తారు. అందరిపైనా చిరాకు పడతారు.
3.మిథున రాశి..
ఈ రాశి వారు ఏదీ ప్లాన్ ప్రకారం చేయాలని అనుకోరు. కనీసం ప్లాన్ ప్రిపేర్ కూడా చేయరు. ఎవరైనా తమతో ఉండేవారు ప్లాన్ ప్రిపేర్ చేస్తే.. దానికి తగినట్లు ఫాలో అయిపోతారు. పెద్దగా దాని గురించి శ్రమ తీసుకోరు.
4.కర్కాటక రాశి..
ఈ రాశివారు ఆ గ్రూప్ మొత్తానికి అమ్మలాగా ప్రవర్తిస్తారు. అమ్మ ఎలాగైతే బిడ్డల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుందో.. ఈ రాశివారు కూడా అంతే.. ఎవరికి ఏం కావాలి..? అని తెలుసుకోని ముందుగానే వారి అవసరాలు తీరుస్తారు.
5.సింహ రాశి..
ఈ రాశివారికి వెకేషన్ కి వెళ్లాం అంటే చాలు.. ఫోటోలు తీయడమన్నా.. దిగడమన్నా చాలా ఇష్టం. వీరు అదే పనిమీద ఉంటారు. పూలు, అడవి, బీచ్ ల దగ్గర తాము ఫోటోలు దిగుతూ ఉంటారు.
6.కన్య రాశి..
ఈ రాశివారికి పని మీద ఉన్న దృష్టి ఎక్కువ. వెకేషన్ కి వెళ్లినా కూడా.. వీరు తమ వర్క్ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆఫీస్ కాల్స్ మాట్లాడటం.. లాంటివి చేస్తూ ఉంటారు.
7.తుల రాశి..
ఈ రాశివారు.. వెకేషన్ కి వచ్చాం అంటే చాలు... తమలోని ఫ్యాషన్ సెన్స్ ని మొత్తం బయటకు తీస్తారు. చాలా ట్రెండీగా తయారై సందడి చేస్తారు. చాలా ఆనందంగా వెకేషన్ ని ఎంజాయ్ చేస్తారు.
8.వృశ్చిక రాశి...
ఈ రాశివారికి కొత్త వారితో స్నేహం చేయడం చాలా సరదా.. అందుకే వెకేషన్ కి వెళ్లిన సమయంలో అక్కడ కొత్త వారితో పరిచయం పెంచుకొని.. వారితో సరదాగా గడుపుతారు. తెలియని వారి గురించి తెలుసుకోవడం వీరికి బాగా ఇష్టం.
9. ధనస్సు రాశి..
ఈ రాశివారికి ట్రావెలింగ్ చేయడం ఇష్టం... వెకేషన్స్ కి వెళ్లడం ఇష్టం. కానీ.. ఏదో ఒక విషయంలో పేచీలు పెడుతూనే ఉంటారు. ఇతరులపై ఫిర్యాదులు చేస్తూ ఉంటారు.
10.మకర రాశి..
ఈ రాశి వారు.. వేకేషన్ కి వెళ్లిన దగ్గర ఏక్కడ ఏమున్నాయో తెలుసుకుంటారు. ముఖ్యంగా వారికి నచ్చిన కాఫీ షాప్ ఎక్కడ ఉంది..? గుడి ఎక్కడ ఉంది.. ఇలా ప్రతిదీ.. ఎక్కడ ఏది ఫేమస్ అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
11.కుంభ రాశి..
ఈ రాశివారు వెకేషన్ కి వెళ్లినా.. అలా ఉండాలి ఇలా ఉండాలి అని సోకులకు పోరు. ఎక్కడకు వెళ్లినా.. తమ కంఫర్ట్ ని బట్టి వారు దుస్తులు ధరిస్తారు. వెకేషన్ కి వెళ్లాం కదా అని ఇష్టం లేని డ్రస్సులు వేసుుకోలేరు.
12.మీన రాశి..
ఈ రాశివారు టూమచ్ ఉంటారు. వెకేషన్ లో ఎవరైనా అందంగా కనపడితే.. వారు ఎవరు.. ఎంటి అనే తేడా లేకుండా ఫ్లర్టింగ్ చేయడం మొదలుపెడతారు. వీరితో చాలా సరదాగా ఉంటుంది.