కేతువు ఇప్పుడు సింహరాశిలోనే ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వారిపై దాని ప్రభావం ఉంటుంది. వీరు ఎక్కువగా బాధపడే అవకాశం ఉంది. శుక్రుడు కూడా ప్రస్తుతం ఇదే రాశిలో ఉండటంతో, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. భారీ పెట్టుబడులు, పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వీరిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఇక ప్రేమ, వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు రావచ్చు. కాబట్టి మూడు రోజుల పాటూ జాగ్రత్తగా ఉండాలి.