Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కొత్త అవకాశాలు.. విలువైన వస్తు లాభాలు!

Published : Jul 16, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 16.07.2026 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఆదాయం బాగున్నప్పటికీ, అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగిపోతాయి.

313
వృషభ రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో సానుకూల మార్పులు ఉంటాయి. పాత బాకీలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దూర ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. వ్యాపారాలు అనుకూలం.

413
మిథున రాశి ఫలాలు

కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. ఉద్యోగాలలో మీ ఆలోచనలకు మంచి స్పందన లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.

513
కర్కాటక రాశి ఫలాలు

ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. అనవసరపు ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. శారీరక, మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

613
సింహ రాశి ఫలాలు

ఉద్యోగాలలో పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

713
కన్య రాశి ఫలాలు

అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో పై అధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. పాత స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

813
తుల రాశి ఫలాలు

ఉద్యోగాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం కాస్త లేటుగా దక్కుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. పెద్దల సలహాలు కలిసివస్తాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన పరిచయాలు వ్యాపార అభివృద్ధికి తోడ్పడతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ఆదాయం బాగుంటుంది. గత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు.

1113
మకర రాశి ఫలాలు

ఉద్యోగాలలో పని ఒత్తిడి ఉంటుంది. ఓర్పు, పట్టుదలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి.

1213
కుంభ రాశి ఫలాలు

ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

1313
మీన రాశి ఫలాలు

ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తు లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories