Sun Moon Conjunction: సూర్య చంద్రుల కలయిక చాలా ముఖ్యమైనది. మార్చి 5, 2026న సూర్య, చంద్రుల కలయిక వల్ల వ్యతిపత్ యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి ఏమాత్రం మంచిది కాదు. ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి.
జ్యోతిష శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య తెలుగు ప్రజల్లో చాలా ఎక్కువ. ముఖ్యంగా సూర్య, చంద్ర గ్రహాలు ఎంతో ముఖ్యమైనది. ఈ రెండింటి వల్ల ఏర్పడే యోగాలు 12 రాశుల వారి జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రెండు కలయిక వల్ల వ్యతిపత్ యోగం ఏర్పుడుతుంది. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ యోగం అందరికీ శుభప్రదం కాకపోవచ్చు. కొన్నిసార్లు అశుభ ప్రభావాలు కూడా కలుగుతాయి. కొన్ని రాశుల వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. దృక్ పంచాంగం ప్రకారం మార్చి 5, 2026న గ్రహాల రాజు అయిన సూర్యుడు, ఆనందాన్ని ఇచ్చే చంద్రుడు కలవబోతున్నారు. ఆ ఇద్దరూ వ్యతిపత్ యోగాన్ని ఏర్పరుస్తున్నారు.
24
వృషభ రాశి
వృషభ రాశి వారు 2026 మార్చిలో మొదటి ఐదు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అయిదు రోజులు ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు రావచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ యోగం వల్ల ఈ రాశి వారి కుటుంబ సభ్యలలో ఎవరో ఒకరి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఇది ఇంట్లో ఇబ్బందులకు కారణం అవుతుంది.
34
కన్యా రాశి
కన్యా రాశి వారికి మార్చి 5, 2026న ఏర్పడే వ్యతిపత్ యోగం మంచిది కాదు. కన్యా రాశి వారికి ఇది అశుభ యోగం. వ్యాపారంలో ఉన్న భాగస్వాములు ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ అయిదు రోజుల పాటూ కొత్త ఒప్పందాలు చేసుకోకూడదు. వాటి వల్ల నష్టాలు, సమస్యలు తప్ప మరేమీ ఉండవు. మార్చి నెల ప్రారంభంలో మీరు దాచుకున్న డబ్బు మొత్తం ఖర్చయిపోయే అవకాశం ఉంది. అలాంటి ఆకస్మిక ఖర్చులు వచ్చిపడవచ్చు.
వృషభ, కన్య రాశులే కాదు మీన రాశి వారికి కూడా ఈ వ్యతిపత్ యోగం ఏమాత్రం మంచిది కాదు. డబ్బు కొరత వచ్చే అవకాశం ఉంది. ఇది మీనరాశి వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. మీ అనుబంధాలు, సంబంధీకుల పట్ల మీరు అసంతృప్తిగా ఉంటారు. తరచు వాదనలు, గొడవలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యోగం వల్ల ఆకస్మిక ఖర్చులు రావచ్చు. అలాగే పెద్ద ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంది.