Birth Month: ఈ నెలలో పుట్టిన వారు చాలా స్మార్ట్.. వీరిని మోసం చేయడం అంత ఈజీ కాదు..!

Published : Aug 09, 2025, 10:42 AM IST

కొన్ని ముఖ్యమైన నెలల్లో జన్మించిన వారు చాలా స్మార్ట్ గా ఉంటారు. వీరిని ఎవరూ మోసం చేయలేరు. ఎవరు ఏంటి..? ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలపై వీరికి చాలా అవగాహన ఉంటుంది.

PREV
15
birth month

జోతిష్యశాస్త్రంలో న్యూమరాలజీ ఒక భాగం. ఈ న్యూమరాలజీ ప్రకారం.. ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా మాత్రమే కాదు.. వారు జన్మంచిన నెల ఆధారంగా కూడా వారి స్వభావాన్ని అంచనా వేయవచ్చు. ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన నెలల్లో జన్మించిన వారు చాలా స్మార్ట్ గా ఉంటారు. వీరిని ఎవరూ మోసం చేయలేరు. ఎవరు ఏంటి..? ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలపై వీరికి చాలా అవగాహన ఉంటుంది. వీరి ముందు ఎవరి పప్పులు ఉడకవు. మరి, ఆ నెలలు ఏంటో చూద్దామా...

25
నవంబర్..

న్యూమరాలజీ ప్రకారం, నవంబర్ నెలలో జన్మించిన వ్యక్తులు తెలివి తేటలు, స్మార్ట్ నెస్ లో ముందు వరసలో ఉంటారు. వీరు కేవలం తెలివైన వారు మాత్రమే కాదు.. వీరి ఆలోచనలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఈ నెలలో జన్మించిన వారు ఎప్పుడూ ఇతరుల కంటే భిన్నంగా ఆలోచిస్తారు.ఏ సమస్యను అయినా ఎలా పరిష్కరించాలో వీరికి బాగా తెలుసు. ఆ నేర్పు వీరిలో ఉంటుంది.వీరికి అన్ని విషయాలపైనా ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆసక్తి ఉన్న ప్రతిదీ నేర్చుకోవడానికి తమ వంతు ఎఫర్ట్ పెడతారు.వీరిని అంత ఈజీగా ఎవరూ మోసం చేయలేరు.

35
మార్చి...

న్యూమరాలజీ ప్రకారం.. స్మార్ట్ నెస్ లో నవంబర్ తర్వాత మార్చి నెలలో పుట్టినవారు ఉంటారు. వీరు బహుముఖ ప్రజ్ఞ కలిగి ఉంటారు. వీరికి కొత్త విషయాలు, పద్ధతులు నేర్చుకోవడం చాలా సరదా. వాటి మీద ఆసక్తి కూడా చాలా ఎక్కువ. వీరి తెలివి తేటలతో అన్నింట్లోనూ విజయం సాధిస్తారు. చాలా తొందరగా ఆలోచిస్తారు.వారి శీఘ్ర ఆలోచన కారణంగా, వారు ఏదైనా నిర్ణయం త్వరగా తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వారి తెలివితేటలకు అందరూ ముగ్ధులవుతారు.

45
జూలై :

సంఖ్యాశాస్త్రం ప్రకారం, జూలై నెల మూడో స్థానంలో ఉంటుంది. వారు ఏ విషయాన్ని అయినా వేరే కోణం నుండి చూస్తారు. వారు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు. వారు వ్యవహరించడం సులభం. ఈ నెలలో జన్మించిన వ్యక్తులు మనోహరంగా, సామాజికంగా నైపుణ్యం కలిగి ఉంటారు. మంచి వక్తలుగా ఉంటారు.

55
సెప్టెంబర్:

సంఖ్యాశాస్త్రం ప్రకారం, సెప్టెంబర్‌లో జన్మించిన వ్యక్తులు ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నారు. వారు వారి తెలివితేటలు, సున్నితత్వానికి ప్రసిద్ధి చెందారు. వారు ఏదైనా విషయాన్ని విశ్లేషించి దాచిన సత్యాలను వెలికితీస్తారు. వారి తెలివితేటలు ఎల్లప్పుడూ రహస్యంగా ఉంటాయి. అవసరమైనప్పుడు మాత్రమే వారు దానిని ఉపయోగిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories